Top
logo

రాహుల్, పున్ను.. రొమాంటిక్ డాన్స్

రాహుల్, పున్ను.. రొమాంటిక్ డాన్స్
X
Rahul sipligunj, Punarnavi Bhupalam
Highlights

రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి భూపాలం వీరిద్దరూ బిగ్ బాస్ 3 కి ముందు ఎవరికీ పెద్దగా పరిచయం లేదు.

రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి భూపాలం వీరిద్దరూ బిగ్ బాస్ 3 కి ముందు ఎవరికీ పెద్దగా పరిచయం లేదు. కానీ ఈ షో ద్వారా కేవలం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి మాత్రమే కాదు.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికి దగ్గరయ్యారు. ఇక ఈ షోకి రాహుల్ విన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. హౌజ్‌లో ఉన్నంత కాలం రాహుల్ పునర్నవి మధ్యలో ఏదో జరుగుతుందని సోషల్ మీడియా రకరకాల వార్తలు వచ్చాయి. కానీ మా మధ్య ఏమిలేదని, మేము మంచి ఫ్రెండ్స్ అని రాహుల్, పునర్నవిలు చాలా సందర్బాల్లో స్పష్టం చేశారు.

అయితే షో నుంచి బయటకు వచ్చాక రాహుల్, పునర్నవి, వరుణ్ సందేశ్, వితిక చాలా సార్లు కలిసారు. పార్టీలు కూడా చేసుకున్నారు. అయితే ఇప్పుడు రాహుల్ , పునర్నవి కలిసి మరోసారి ఓ పార్టీలో కలిసి అలరించారు. తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో 'రంగమార్తాండ' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే రంగమార్తండ టీమ్ నిన్న జాలీగా నైట్ పార్టీ చేసుకుంది. ఆ పార్టీలో రాహుల్ అండ్ పునర్నవి అదరగొట్టారు. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో ఈ ఇద్దరూ రొమాంటిక్‌గా డాన్స్ చేశారు. దానికి సంబందించిన ఓ వీడియోను రాహుల్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఇక రంగమార్తండ సినిమా విషయానికి వచ్చేసరికి మరాఠిలో మంచి హిట్టు అయిన నటసామ్రాట్‌కు సినిమాకి రీమేక్‌గా ఈ సినిమాని చేస్తున్నారు. అక్కడ నానా పటేకర్ మెయిన్ లీడ్ లో నటించి మెప్పించారు. ఇక్కడ ఆ పాత్రను ప్రముఖ నడుటు ప్రకాష్ రాజ్ పోషిస్తున్నారు. రమ్యకృష్ణ, బ్రహ్మనందం, అనసూయ, రాహుల్, శివాత్మిక రాజశేఖర్, అలీ రెజా ముఖ్యపాత్ర్రలలో నటిస్తున్నారు. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. మరాఠిలో మంచి హిట్టు అయిన సినిమాకి రీమేక్ ని క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డీల్ చేయడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాని రిలీజ్ చేయనున్నారు.Web TitleRahul sipligunj and punarnavi bhupalam dances on romantic song
Next Story