మహేష్ చేతుల మీదిగా రఘుపతి వెంకయ్య నాయుడు ట్రైలర్ రిలీజ్ ..

Raghupathi Venkaiah Naidu
x
Raghupathi Venkaiah Naidu
Highlights

తెలుగులో బయోపిక్ ల యొక్క జోరు మాములుగా లేదు. మహానటి, ఎన్టీఆర్ బయోపిక్ లు విడుదల అయి మంచి విజయాన్ని సంపాదించుకున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు రఘుపతి...

తెలుగులో బయోపిక్ ల యొక్క జోరు మాములుగా లేదు. మహానటి, ఎన్టీఆర్ బయోపిక్ లు విడుదల అయి మంచి విజయాన్ని సంపాదించుకున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు రఘుపతి వెంకయ్య నాయుడు బయోపిక్ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో రఘుపతి వెంకయ్య నాయుడు పాత్రలో సీనియర్ నటుడు నరేష్ నటిస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు తన చేతుల మీదిగా విడుదల చేసారు. ఈ సినిమాలో తెలుగు సినిమా పరిశ్రమ కోసం రఘుపతి వెంకయ్య నాయుడు ఎంత కృషి చేసారు అన్న నేపధ్యంతో తెరకెక్కిస్తున్నారు. " ఈ సినిమా లైట్ పడినంత కాలమే ఈ సినిమా వాడైనా వెలుగులో ఉంటాడు. ఏ రోజు అయిన సినిమానే ఈ సమాజాన్ని మారుస్తుంది. సినిమానే ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది. అంటూ వచ్చే డైలాగ్స్ ట్రైలర్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

ఫాదర్ అఫ్ సౌత్ ఇండియన్ సినిమాగా రఘుపతి వెంకయ్య నాయుడు అని ఎందుకు పిలుస్తారు లాంటి బలమైన అంశాలతో సినిమా తెరకేక్కుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి బాబ్జి దర్శకత్వం వహిస్తుండగా, ఎల్లో లైన్ పిక్చర్స్ బ్యానర్ పై మండవ సతీష్ బాబు సినిమాని నిర్మిస్తున్నారు. ఈ నెల 29 న సినిమాని విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ట్రైలర్ లో పేర్కొంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories