ఆ సినిమాకి డాన్స్ మాస్టర్ లేడు..అన్ని నేనే చేశా..అవార్డు కూడా వచ్చింది

k raghavendra rao
x
k raghavendra rao
Highlights

పలానా సినిమా చూస్తూ ఆ సినిమా దర్శకుడు ఎవరు అనేది చెప్పడం చాలా కష్టం.. కానీ దర్శకుడు ఎవరో తెలియకున్నా సినిమా టేకింగ్ చూసి కచ్చితంగా ఈ సినిమా దర్శకుడు...

పలానా సినిమా చూస్తూ ఆ సినిమా దర్శకుడు ఎవరు అనేది చెప్పడం చాలా కష్టం.. కానీ దర్శకుడు ఎవరో తెలియకున్నా సినిమా టేకింగ్ చూసి కచ్చితంగా ఈ సినిమా దర్శకుడు అతనే చెప్పే దర్శకుల్లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఒకరు.. అయన సినిమాలు, ఆ సినిమాల్లోని పాటలు ప్రేక్షకుల మదిలో అలా నిలిచి పోయాయి. అయన ప్రతి సినిమా పాటల్లో కచ్చితంగా అయన తాలూకు మార్క్ కచ్చితంగా మనకి కనబడుతుంది. తాజాగా అయన ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

అందులో భాగంగా శ్రీకాంత్, దీప్తి బాట్నాగర్, రవళి కలిసి నటించిన పెళ్లి సందడి సినిమా గురించి ప్రస్తావన రాగా దీనిపైన రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. " సాధారణంగా కొరియోగ్రాఫర్ ని పెట్టి ఓ గ్రూప్ సాంగ్ ని తీయాలంటే అందరు కనపడాలి కాబట్టి.. లాంగ్ లో కెమరా పెట్టాలి. అప్పుడు ఎవరు డాన్స్ చేస్తున్నారో అర్ధం కాదు. అందుకే అసలు డాన్స్ మాస్టర్ లేకుండా సినిమా చేయాలనీ అనుకున్నాను. పెళ్లి సందడి సినిమాలో చేసేసాను. దీనితో ఆ సినిమాకి గాను ఉత్తమ కోరియోగ్రఫర్ గా అవార్డు కూడా ఇచ్చారు. నన్ను ప్రోత్సహించిన డాన్స్ మాస్టర్ లకి ధన్యవాదాలు అని ఈ సందర్భంగా తెలిపారు రాఘవేంద్రరావు.. మొత్తం పెళ్లి సందడి సినిమాలో తొమ్మిది పాటలకి గాను రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తూ కోరియోగ్రఫీ చేసారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories