ఆ సినిమాతో నా పని అయిపొయింది అన్నారు : రాఘవేంద్రరావు

k raghavendra rao
x
k raghavendra rao
Highlights

తెలుగు సినిమా పుస్తకంలో తనకంటూ ఓ పేజీని క్రియేట్ చేసుకున్నాడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు... వందకిపైగా సినిమాలకి దర్శకత్వం వహించారు. . చాలా మంది...

తెలుగు సినిమా పుస్తకంలో తనకంటూ ఓ పేజీని క్రియేట్ చేసుకున్నాడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు... వందకిపైగా సినిమాలకి దర్శకత్వం వహించారు. . చాలా మంది హీరోలను వెండితెరకు పరిచయం చేసారు. తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన అయన తన సినీ జీవితంలో జరిగిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

అందులో భాగంగా చిరంజీవి, శ్రీదేవి కలిసి నటించిన జగదీకవీరుడు అతిలోక సుందరి సినిమా గురించి చెప్పుకొచ్చారు రాఘవేంద్రరావు .. " ఆ సినిమాకి ముందు నాకు ఫ్లాప్స్ ఉన్నాయి.. కానీ చిరంజీవి, అశ్వీనిదత్తు నన్ను నమ్మి రిస్క్ చేసి ఆ సినిమాని రాఘవేంద్రరావు మాత్రమే తీయగలరని నాకు అప్పగించారు. నిజంగా వారిద్దరికీ ముందుగా కృతజ్ఞతలు చెప్పాలి. ఈ చిత్రం విడుదలకు ముందు రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేశాయి.

ఇక సినిమా మొదటి మూడు రోజులు చూసిన ప్రేక్షకులు ఇది విటాలచర్య చేయాల్సిన సినిమా అని అన్నారు. ఇక రాఘవేంద్రరావు పని అయిపొయిందని అన్నారు. కానీ ఈ చిత్రం అఖండ విజయాన్ని నమోదు చేసుకొందని చెప్పుకొచ్చారు. ఈ సినిమా తర్వాత జగదీకవీరుడు అతిలోక సుందరి సినిమాకి రీమేక్ చేయమని కోరారని, కానీ నాకు అది ఇష్టం లేదు అని చెప్పుకొచ్చానని అన్నారు. ఈ సినిమా తర్వాత రాఘవేంద్రరావు, చిరంజీవి కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చి విజయాలను సొంతం చేసుకున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories