Raghava Lawrence: కరోనా కట్టడికి లారెన్స్ భారీ విరాళం

Raghava Lawrence: కరోనా కట్టడికి లారెన్స్ భారీ విరాళం
x
Raghava lawrence
Highlights

ప్రపంచాన్నీ వణికిస్తున్న కరోనా వైరస్ ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలుపెరుగని పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రపంచాన్నీ వణికిస్తున్న కరోనా వైరస్ ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలుపెరుగని పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.. ప్రబుత్వాలు చేస్తున్న ఈ పోరాటానికి సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ముందుకు వచ్చి తమ వంతుగా సహాయం చేసి బాసటగా నిలుస్తున్నారు.

ఇప్పటికే ఎంతోమంది సినీ ప్రముఖులు సినీ కార్మికులకు అండగా నిలిచారు. టాలీవుడ్ నుంచి అత్యధికంగా ప్రభాస్ రూ.4 కోట్లు విరాళం ఇవ్వగా, బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ అత్యధికంగా 25 కోట్ల విరాళం ఇచ్చారు. ఇక కోలివుడ్ నుంచి అత్యధికంగా అజిత్ రూ.1.25 కోట్ల విరాళం ఇచ్చాడు.

ఇప్పుడు వీరందరినీ మించి కొరియోగ్రాఫర్, హీరో, దర్శకుడు అయిన రాఘవ లారెన్స్ రూ.3 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ఇందులో పీఎం కేర్స్ ఫండ్, తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్, ఎఫ్ఈఎఫ్ఎస్‌ఐ యూనియన్, డాన్సర్స్ యూనిన్లకు రూ.50 లక్షల చొప్పున ఇస్తున్నారు.

అలాగే, దివ్యాంగులకు రూ.25 లక్షలు, తన స్వస్థలం చెన్నైలోని రోయపురంలోని పేద ప్రజల కోసం రూ.75 లక్షల సాయం అందజేస్తున్నట్టుగా లారెన్స్ ప్రకటించాడు. ఇక లారెన్స్ తన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా మందికి సహాయం చేస్తున్న సంగతి తెలిసిందే.. చిన్న పిల్లలకి గుండె ఆపరేషన్లు చేసి ఎన్నోసార్లు తన పెద్ద మనసును చాటుకున్నాడు.

చంద్రముఖి2లో లారెన్స్ :

ఇక ఇదే సందర్భంగా మరో శుభవార్తను అందజేశాడు లారెన్స్.. రజినీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమాకి సీక్వెల్ గా చంద్రముఖి 2 తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాలో తానూ నటిస్తున్నట్టుగా లారెన్స్ వెల్లడించాడు. ఈ సినిమాకి గాను తీసుకున్న అడ్వాన్స్ ను విరాళంగా ప్రకటిస్తున్నట్టు లారెన్స్ వెల్లడించాడు. పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది..



Show Full Article
Print Article
More On
Next Story
More Stories