యామినితో విజయ్ దేవరకొండ

యామినితో విజయ్ దేవరకొండ
x
WFI
Highlights

విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌'... డిఫిరెంట్ లవ్ స్టొరీగా ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటకే విడుదల చేసిన...

విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌'... డిఫిరెంట్ లవ్ స్టొరీగా ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటకే విడుదల చేసిన సినిమా ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మొత్తం ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్‌ గా నటిస్తున్నారు. అందులో ఐశ్వర్యా రాజేష్‌, ఇజాబెల్లె లెయితె, క్యాథరిన్‌ థ్రెసా, రాశీ ఖన్నాలు ఉన్నారు. అయితే ఈ నలుగురు హీరోయిన్స్‌ పాత్రలకు, హీరో పాత్రకు ఉన్న రిలేషన్‌ ఏంటి అన్నది ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది.

చిత్రీకరణకి చివరి దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసింది. అందులో భాగంగానే ఇప్పటికే ఐశ్వర్యా రాజేష్‌, ఇజాబెల్లె లెయితె, క్యాథరిన్‌ థ్రెసా లుక్స్‌ను వరుసగా మూడు రోజులలో విడుదల చేస్తూ వచ్చింది. తాజాగా ఈరోజు రాశీ ఖన్నా లుక్‌ను హీరోతో ఆ పాత్రకు ఉన్న రిలేషన్‌ను తెలియజేస్తూ విడుదల చేశారు. ఇందులో రాశీ ఖన్నా యామిని పాత్రలో నటిస్తుంది.

ఈ నలుగురు హీరోయిన్స్ తో విజయ్‌ వేర్వేరు పేర్లతో, డిఫిరెంట్ లూక్స్ తో కనిపిస్తున్నాడు. ఈ సినిమాని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేస్తున్నారు. జవనరి 3న ఈ సినిమా టీజర్‌ విడుదల కానుంది. క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కె.ఎస్‌.రామారావు సమర్పణలో కియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నారు. గోపీ సుందర్‌ సంగీతం సమకూరుస్తున్నారు.

ఈ సినిమా తర్వాత విజయ్‌ దేవరకొండ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని ప్రచారం నడుస్తుంది. ఈ సినిమాకి చార్మీ మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమా విడుదల కానుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories