పూరి, ఛార్మిని మనం అభినందిచాల్సిందే కదా ... !

పూరి, ఛార్మిని మనం అభినందిచాల్సిందే కదా ... !
x
Highlights

డైరెక్టర్ పూరి జగన్నాధ్ .. పెద్దగా పరిచయం అక్కర్లేదు .. చాలా సినిమాలు చేసాడు. ఇండస్ట్రీకి, హీరోలకు చెప్పుకోదగ్గ సినిమాలు ఇచ్చాడు. అయన సినిమాలో పంచ్...

డైరెక్టర్ పూరి జగన్నాధ్ .. పెద్దగా పరిచయం అక్కర్లేదు .. చాలా సినిమాలు చేసాడు. ఇండస్ట్రీకి, హీరోలకు చెప్పుకోదగ్గ సినిమాలు ఇచ్చాడు. అయన సినిమాలో పంచ్ డైలాగ్స్ ఎలా ఉంటాయో మంచి ఫిలాసఫి కూడా ఉంటుంది. అయన తన సినిమాల ద్వారా ఫిలాసఫి చెప్పడమే కాదు వాటిని పాటిస్తున్నాడు కూడా ..

అయన తాజాగా దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సంపాదించుకుంది. ఈ సినిమాకి పూరి కేవలం దర్శకుడు మాత్రమే కాదు. నటి ఛార్మితో కలిసి ఓ నిర్మాత కూడా.. సినిమాకి పెట్టిన డబ్బుల కంటే బాగానే వచ్చాయి. కొత్త సినిమాలు కూడా చేస్తున్నారు . కానీ సినిమాలు, డబ్బులు లేనప్పుడు వారు పడ్డ కష్టాలు గుర్తున్నాయి.

అందుకే ఇలాంటి ఇబ్బందులో ఉన్నా ఓ ముప్పై మంది డైరక్టర్లకు మరియు కోడైరక్టర్లకు పూరి , ఛార్మి కలిసి ఒక్కొకరికి యాబై వేల రూపయలు అందజేశారు. పూరి పుట్టిన రోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇలా సినిమాల్లో ఆదాయం వచ్చిన ప్రతిసారి అందరికి సహాయం చేస్తామని పూరి, ఛార్మి చెప్పుకొచ్చారు. ఇలాంటి వాళ్ళను మనం అభినందిచాల్సిందే కదా ... !

Show Full Article
Print Article
More On
Next Story
More Stories