అలీ బ్లెస్సింగ్స్‌తో నేను పోగొట్టుకున్నవన్నీ వచ్చాయి: పూరీ భావోద్వేగం

అలీ బ్లెస్సింగ్స్‌తో నేను పోగొట్టుకున్నవన్నీ వచ్చాయి: పూరీ భావోద్వేగం
x
Highlights

ప్రముఖ నటుడు, కామెడియన్ అలీ వల్లే తాను ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్ననని ప్రముఖ డ్యాషింగ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు. నటుడు అలీతో కలిసి పండుగాడి ఫోటో స్టూడియో సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నాడు పూరీ.

ప్రముఖ నటుడు, కామెడియన్ అలీ వల్లే తాను ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్ననని ప్రముఖ డ్యాషింగ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు. నటుడు అలీతో కలిసి పండుగాడి ఫోటో స్టూడియో సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నాడు పూరీ. ఈ సందర్భంగా స్టేజ్ పైనా పూరీ మాట్లాడుతూ ఒకప్పుడు అలీ చేసిన సాయం గుర్తుతెచ్చుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు డైరెక్టర్ పూరీ. తన పదేళ్ల వయసులో సీతాకోక చిలుక సినిమా చూశా. పశ్చిమగోదావరి జిల్లా తునిలో ఓ మ్యూజికల్ పార్టీకి అలీ వస్తున్నాడని తెలిసి అక్కడికి వెళ్లానని, అప్పుడు అలీ నా కన్నా పొట్టిగా ఉన్న అప్పట్లో అమితాబ్ బచ్చన్ సాంగ్‌కు డ్యాన్స్ వేసేవారు అని చెప్పారు. అలీకు తాను పెద్ద ఫ్యాన్‌ను. దర్శకుడిగా నేను సినిమాలు చేయడం. కొన్ని హిట్లు అయితే, మరికొన్ని ప్లాప్‌లు అయ్యాయి.

తనకు ఎప్పుడన్న భాధలో ఉండి, కష్టాల్లో ఉన్నప్పుడు తాను అలీ ఓ పెగ్గు పోస్తాడని అని అన్నారు. తను సినిమా సక్సెస్ అయితే మాత్రం బోకె తీసుకొచ్చి ఇస్తాడు అని, తనకు చెప్పకుండా వచ్చి నన్ను కలిసే ఏకైక వ్యక్తి ఒక్క అలీయేనని అన్నారు. ఓ సందర్భంలో తన జీవితం సతమతమైన సమయంలో అప్పుడు అలీ వచ్చాడు. అప్పుడు అలీ తన వద్ద ఉన్నా గొల్డ్ చైన్ ఇచ్చి నీకు దేవుడి నమ్మకం ఉంటే ఇది నీ దగ్గరపెట్టుకో అని చెప్పాడు.. అలీ బ్లెస్సింగ్స్‌తో నేను పోగొట్టుకున్నవన్నీ రెండు, మూడేళ్లలో వచ్చాయని ఈ సందర్భంగా అలీని గుర్తుచేసుకున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories