Top
logo

రక్షించాలని దేవుడికి మొక్కినా ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోడినే : పూరి జగన్నాధ్

రక్షించాలని దేవుడికి మొక్కినా ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోడినే : పూరి జగన్నాధ్puri jagannadh
Highlights

గత నెల 27న వెటర్నరీ వైద్యురాలిపై అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసిన ఘటన ప్రతి ఒక్కరిని కదిలించింది.

గత నెల 27న వెటర్నరీ వైద్యురాలిపై అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసిన ఘటన ప్రతి ఒక్కరిని కదిలించింది. ఈ ఘటనలో పాల్గొన్న నలుగురు నిందితులను షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి వద్ద ఎన్‌కౌంటర్ చేసారు. దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంతో దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.

ఈ నేపధ్యంలో దర్శకుడు పోలీసులను అభినందిస్తూ పూరి జగన్నాధ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తెలంగాణ పోలీసులకు సల్యూట్ చేస్తున్నానని, అంతేకాదు చేతులెత్తి మొక్కుతున్నానంటూ మీరే నిజమైన హీరోలు.. నేను ఎప్పటికి ఒక్కటే నమ్ముతాను. మనకి కష్టమొచ్చిన కన్నీళ్లోచ్చినా పోలీసోడే వస్తాడని.. అంతేందుకు నువ్వే దిక్కు రక్షించాలని దేవుడికి మొక్కినా ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోడినే అంటూ పూరి జగన్నాధ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

గత నెల నవంబరు 28న రాత్రి శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి టోల్ గేట్ సమీపంలో లారీలపై పని చేసే నలుగురు వ్యక్తులు దిశాను అత్యాచారం చేసి హత్య చేశారు. క్లూ దొరకకుండా ఉండేదుకు పెట్రోల్ పోసి తగలబెట్టారు. కానీ పోలీసులు 24 గంటల్లో కేసును చేధించి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటన తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నలుగురు నిందితులను నడిరోడ్డుపై ఉరితీయాలని అందరూ డిమాండ్ లు వచ్చాయి.Web TitlePuri Jagannadh response on disha accused encounter
Next Story


లైవ్ టీవి