Champions of Change 2019: అల్లు అరవింద్ కు 'ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డ్' ప్రధానం

Champions of Change 2019: అల్లు అరవింద్ కు ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డ్ ప్రధానం
x
అల్లు అరవింద్
Highlights

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన అద్బుతమైన చిత్రాలతో అందరికి సుపరిచితమే. ఆయన చిత్రాలకు ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. అయన ...

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన అద్బుతమైన చిత్రాలతో అందరికి సుపరిచితమే. ఆయన చిత్రాలకు ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. అయన తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, హిందీ, కన్నడ భాషల్లో కూడా చిత్రాలను నిర్మించారు. రజినీకాంత్, చిరంజీవి, అనిల్ కపూర్, గోవిందా, అమీర్ ఖాన్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోలతో ఆయన చిత్రాలు తీశారు.

తాజాగా అల్లు అరవింద్ గారి సేవలకు ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డ్ ను అల్లు అరవింద్ కు ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈరోజు (సోమవారం) మాజీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డ్ ను అల్లు అరవింద్ కు ప్రధానం చేశారు.

సోషియల్ డెవలప్మెంట్ మరియు కమ్మునిటీ సర్వీస్ చేసిన వారికి ఈ అవార్డు ప్రదానం చేస్తారు. ఈ అవార్డ్స్ ను ఈ ఏడాది నలుగురు ముఖ్యమంత్రలు, కొంతమంది స్పోర్ట్స్ ఛాంపియన్స్ ఈ అవార్డ్ ను స్వీకరించబోతున్నారు. వారిలో శ్రీ అల్లు అరవింద్ గారు సినిమా రంగానికి చెందిన వ్యక్తి కేటగిరీలో ఈ అవార్డ్ అందుకోవడం విశేషం.

కె.జీ బాలకృష్ణన్ (ఎక్స్ చీప్ సెక్రటరీ ఆఫ్ ఇండియా) జస్టిస్ గ్యాన్ సుధ మిశ్రా (ఎక్స్ జెడ్జ్ సుప్రీమ్ కోర్ట్) అల్లు అరవింద్ కు ఈ అవార్డ్ ఇవ్వడానికి ఎంపిక చేశారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి వస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories