బిగ్ బాస్ సీజన్ 3 కి తలనొప్పులు..

బిగ్ బాస్ సీజన్ 3 కి తలనొప్పులు..
x
Highlights

బిగ్ బాస్ రియాల్టీ షోలలో సంచలనం. తెలుగులో రెండు సీజన్ లకూ అద్భుత స్పందన వచ్చింది. వివాదాలు.. వినోదాలు.. అన్నీ కలబోసి షోను సక్సెస్ చేశాయి. మొదటి సీజన్...

బిగ్ బాస్ రియాల్టీ షోలలో సంచలనం. తెలుగులో రెండు సీజన్ లకూ అద్భుత స్పందన వచ్చింది. వివాదాలు.. వినోదాలు.. అన్నీ కలబోసి షోను సక్సెస్ చేశాయి. మొదటి సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించిన ఎన్టీఆర్ షోను రక్తి కట్టించడంలో సఫలం అయ్యాడు. రెండో సీజన్ కి నాచురల్ స్టార్ నానీ హోస్టుగా వ్యవహరించాడు. అయితే అనుకున్నంతగా నాని ఆకట్టుకోలేకపోయాడు. ఇక ఇపుడు మూడో సీజన్ కి చాలా మంది పేర్లు తెరమీదకు వచ్చాయి. రాకరకాలుగా వార్తలూ వచ్చాయి. వాటన్నిటినీ కాదంటూ తాజాగా నాగార్జున పేరు వినిపిస్తోంది. దాదాపుగా నాగార్జునే షో చేస్తున్నట్టు గా తెలుస్తోంది. అయితే, ఈ షో చేయడానికి నాగార్జున కొన్ని కండిషన్స్ పెట్టాడట. వాటిలో మొదటిది అన్నపూర్ణా స్టూడియో లోనే ఈ షో చేయాలన్నది. బయట ఊళ్లకు తిరిగే పరిస్థితి తనకు లేదనీ, హైదరాబాద్ అయితేనే చేస్తాననీ నాగ్ చెప్పారని తెలుస్తోంది. ఇక భారీ పారితోషికం నాగార్జున డిమాండ్ చేశాడట. దాదాపు పదిహేను కోట్లు అడిగారని, దానికి కూడా షో నిర్వాహకులు సరే అన్నారని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం నాగార్జున మన్మథుడు షూటింగ్ కోసం ఇజ్రాయెల్ లో ఉన్నారు. అది పూర్తి చేసుకుని తిరిగి వచ్చాకా అన్ని విషయాలతో సమావేశం పెట్టడానికి మా టీవీ సిద్ధం అవుతోందట.

ఇదిలా ఉండగా జూన్ లో ప్రారంభించాల్సిన షోను జులై కి వాయిదా వేయాలని మా భావిస్తోందని బలంగా వినబడుతోంది. జూన్ లో వరల్డ్ కప్ క్రికెట్ జరుగనుంది. ఈ హడావుడిలో బిగ్ బాస్ కు ప్రేక్షకుల ఆదరణ దక్కడం కష్టమని మా వర్గాలు భావిస్తున్నాయట. అందుకే జూలై ఆఖరు వారం నుంచి షోను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్!

Show Full Article
Print Article
Next Story
More Stories