ప్రధాని మోడీని ఆకట్టుకున్న మెగా హీరో రామ్ చరణ్ ట్వీట్.. బాగా చెప్పావ్ అంటూ రీట్వీట్!

ప్రధాని మోడీని ఆకట్టుకున్న మెగా హీరో రామ్ చరణ్ ట్వీట్.. బాగా చెప్పావ్ అంటూ రీట్వీట్!
x
Highlights

కరోనా పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద యుద్దాన్నే చేస్తున్నాయని చెప్పాలి. దీనిని అరికట్టేందుకు ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించాయి.

కరోనా పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద యుద్దాన్నే చేస్తున్నాయని చెప్పాలి. దీనిని అరికట్టేందుకు ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించాయి. ఇక ఏప్రిల్ 5 న రాత్రి తొమ్మిది గంటలకి తొమ్మిది నిమిషాల పాటు దీపాలు వెలిగించాల‌ని మోదీ పిలుపు ఇచ్చిన విష‌యం తెలిసిందే. మోదీ ఇచ్చిన పిలుపుకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తుంది. ఇక తెలుగు చిత్రపరిశ్రమ నుంచి అగ్రహీరోలు చిరంజీవి, నాగర్జున మద్దతు తెలుపుతూ ప్రధాని ఇచ్చిన పిలుపును పాటించి కరోనా వైరస్ ని తరిమికొట్టాలని పిలుపునిస్తూ వీడియో రూపకంగా వెల్లడించారు.

ఇక మెగాహీరో రామ్‌చ‌ర‌ణ్ ఓ వీడియో చేశారు. ఇండ్లల్లో లైట్లు ఆర్పేసి.. దీపాలు వెలిగిద్దాం.. మ‌న ప్రధాన‌మంత్రి మాట పాటిద్దాం.. క‌రోనాలేని భార‌త్‌ను డెఫినెట్‌గా సాధిద్దామ‌ని రామ్ చరణ్ ఈ వీడియోను పోస్టు చేశారు.ఈ వీడియో భారత ప్రధాని మోడీని ఆకట్టుకుంది. ఆయన ఈ వీడియోను రీట్వీట్ చేశారు. రెట్విట్ చేస్తూ ప్రధాని రామ్ చరణ్ ను ఉద్దేశించి కామెంట్ కూడా చేశారు. బాగా చెప్పావ్... లాక్‌డౌన్‌ను అనుసరిస్తూ.. వెలుగుల్ని ప్రస‌రింప‌చేయాల‌ని మోదీ త‌న ట్వీట్‌లో కోరారు. ప్రస్తుతం ఈ వీడియోని మెగా అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 3,188 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.






Show Full Article
Print Article
More On
Next Story
More Stories