పండగకి పండగ లాంటి సినిమా

పండగకి పండగ లాంటి సినిమా
x
సాయి ధరమ్ తేజ్, సత్యరాజ్, రాశి ఖన్నా
Highlights

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ప్రతి రోజూ పండగే'

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ప్రతి రోజూ పండగే' .. మారుతి దర్శకత్వంలో తెరకేకుతున్న ఈ సినిమాని గీతా ఆర్ట్స్, యువీ క్రియేషన్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని ఈ నెల 20 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

సినిమా ప్రచారంలో భాగంగా చిత్ర యూనిట్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేశారు. అయితే ఈ ట్రైలర్ తోనే చిన్న కథను చెప్పేశాడు దర్శకుడు మారుతి.. క్యాన్సర్ తో భాదపడుతున్న తాత పాత్రలో సత్యరాజ్ కనిపిస్తుంటే .. ఇక తన తాత జీవితంలో ఎం చేయాలనీ చేయలేకపోయాడో అవి నెరవేర్చే మనవడి పాత్రలో కనిపిస్తున్నాడు.

కుటుంబ పెద్ద చనిపోతున్నాడని విదేశాల్లో ఉన్న అతని కుటుంబ సభ్యులు అందరు తిరిగి పల్లెటూరుకి చేరుకుంటారు.అక్కడ మరిచిన బంధాలను, అనుబంధాలను తెలిపే సన్నివేశాలతో కథ సాగుతుందని అర్ధం అవుతుంది. అయితే ఇప్పుడు ఈ చిత్ర ట్రైలర్ ని చూస్తుంటే శతమానం భవతి సినిమా గుర్తొస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

కానీ ఈ సినిమా పక్కా వేరే కథాంశంతో తెరకెక్కుతుందని చిత్ర బృందం తెలుపుతుంది. పండగ లాంటి సినిమా కాబట్టి, కుటుంబ నేపధ్యంతో కూడుకున్న సన్నివేశాలు, సెంటిమెంట్ సన్నివేశాలు ఉండడంతో ఎక్కువగా శతమానం భవతి సినిమాతో పోలికలు ఏర్పడ్డాయి. మనషి పుట్టుకను కాదు. మనిషి చావును కూడా ఓ పండగ లాగే జరుపుకోవాలి అన్న పాయింట్ తో పక్కా ఫ్యామిలి ఎమోషన్స్ తో మారుతి ఈ సినిమాని తెరకెక్కించాడు. సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories