అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిన ప్రకాష్ రాజ్

అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిన ప్రకాష్ రాజ్
x
prakash raj
Highlights

ప్రకాష్ రాజ్ ఎంత గొప్ప నటుడో పెద్దగా చెప్పాల్సిన పని లేదు. అన్ని రకాల పాత్రలను చేయగల నటుడు. ప్రకాష్ రాజ్ కేవలం ఓ నటుడు

ప్రకాష్ రాజ్ ఎంత గొప్ప నటుడో పెద్దగా చెప్పాల్సిన పని లేదు. అన్ని రకాల పాత్రలను చేయగల నటుడు. ప్రకాష్ రాజ్ కేవలం ఓ నటుడు మాత్రమే కాదు. మంచి దర్శకుడు కూడా.. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న రంగామార్తండ సినిమాలో మెయిన్ రోల్ లో నటిస్తున్నాడు ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ తో పాటు రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్‌ సిప్లిగంజ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇ ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అప్డేట్ నని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ సినిమాపైన అంచనాలు పెంచేస్తున్నాడు కృష్ణవంశీ.

తాజాగా మరో సినిమా నుండి మరో అప్డేట్ ని బయటకు వదిలాడు. `నా టీమ్‌లో కొత్త అసిస్టెంట్‌.. గాడ్ బ్లెస్‌ హిం` అంటూ ఓ వీడియోని బయటకు వదిలాడు. కృష్ణవంశీ చెప్పిన ఆ అసిస్టెంట్‌ డైరెక్టర్ ఎవరో కాదు. ప్రకాష్ రాజ్.. సినిమాలో మెయిన్ లీడ్ లో నటిస్తూనే సెట్‌లో అసిస్టెంట్‌లతో కలిసి ఇతర పనుల్లో సాయం చేస్తున్నాడు. అలా ప్రకాష్‌, సెట్‌లో పనిచేస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు కృష్ణవంశీ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సినిమా ఇండస్ట్రీలో కృష్ణవంశీ, ప్రకాష్ రాజ్ లకి మంచి అనుబంధం ఉంది. కృష్ణవంశీ దర్శకత్వం వహించే ప్రతి సినిమాలో ప్రకాష్ రాజ్ తప్పకుండా ఉంటారు. ఇప్పుడు చేయబోయే రంగామార్తండ సినిమాలో ప్రకాష్ రాజ్ కి మంచి పాత్ర దక్కింది. సినిమా కథ బాగా నచ్చడంతో ప్రకాష్ రాజ్ సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడని తెలుస్తోంది.

ఇక రంగ మార్తాండ సినిమా విషయానికి వస్తే.. రంగస్థల కళాకారుడి తెర వెనక జీవితం నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. మరాఠీ భాషలో మంచి హిట్టు అయిన నటసామ్రాట్ సినిమాకి ఇది రీమేక్. ఇందులో బాలీవుడ్‌ నటుడు నానా పటేకర్‌ పోషించిన పాత్రలో తెలుగులో ప్రకాష్ రాజ్‌ చేస్తున్నాడు. కృష్ణవంశీ లాంటి క్రియేటివ్ డైరెక్టర్ ఈ సినిమాని తెరకేక్కిస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాని రిలీజ్ చేయనున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories