ప్రభాస్ ఫాన్స్ కి గుడ్ న్యూస్

ప్రభాస్ ఫాన్స్ కి గుడ్ న్యూస్
x
Highlights

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. సో ప్రభాస్ నుండి ఇప్పుడు సినిమాలు వస్తున్నాయంటే ఇప్పుడు లెక్కలు అంచనాలను దాటిపోతున్నాయి....

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. సో ప్రభాస్ నుండి ఇప్పుడు సినిమాలు వస్తున్నాయంటే ఇప్పుడు లెక్కలు అంచనాలను దాటిపోతున్నాయి. అందులో భాగంగానే వచ్చింది సాహో... భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయిన మంచి కలెక్షన్లను రాబట్టింది ఈ సినిమా.. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ ఇక సినిమాలు చేయడానికి ఎక్కువ టైం తీసుకోనని సంవత్సరంలో రెండు సినిమాలు వచ్చేలా ప్లాన్ చేస్తానని చెప్పుకొచ్చాడు...

ఇప్పుడు జిల్ ఫేం రాధాకృష్ణతో సినిమాని మొదలు పెట్టాడు ప్రభాస్.. ఈ సినిమాకి 'జాన్' అనే టైటిల్ ని పెట్టే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే సినిమా కొంతభాగం పూర్తి చేసుకుంది. తర్వాత షెడ్యుల్ ని హైదరాబాదులో ఓ స్టూడియోలో భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. అయితే తాజా సమచారం ప్రకారం ప్రభాస్ పుట్టినరోజు అయిన అక్టోబర్ 23 న సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసి ఫాన్స్ కి సప్రైజ్ ఇవ్వాలని చిత్ర యూనిట్ ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి ఎం జరుగుతుందో..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories