Top
logo

ప్రభాస్ కొత్త సినిమా బడ్జెట్ ఎంతంటే ?

ప్రభాస్ కొత్త సినిమా బడ్జెట్ ఎంతంటే ?
X
prabhas
Highlights

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ పెరిగింది. ఆ సినిమా తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా ప్యాన్ ఇండియా మూవీగానే

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ పెరిగింది. ఆ సినిమా తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా ప్యాన్ ఇండియా మూవీగానే తెరకెక్కుతుంది. అందులో భాగంగానే దాదాపుగా 350 కోట్ల బడ్జెట్ తో సాహో సినిమా తెరకెక్కింది. సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ బాలీవుడ్ లో మాత్రం సినిమాకి భారీగానే కలెక్షన్లు వచ్చాయి.

ఈ సినిమా విడుదల కాకముందే ప్రభాస్ మరో సినిమాని స్టార్ట్ చేశాడు.ప్రభాస్ కి ఇది 20 వ చిత్రం జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాని మొదలుపెట్టాడు. ఈ సినిమాకి జాన్ అనే టైటిల్ ని పరిశీలనలో ఉంచారు. సాహో సినిమాని నిర్మించిన యువీ క్రియేషన్స్ వారే ఈ సినిమాని కూడా నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ ఆస్ట్రాలజర్‌ పాత్రలో నటిస్తున్నాడన్న వార్తలు వస్తున్నాయి. ఇందులో ప్రభాస్ సరసన పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఈ సినిమాకి బడ్జెట్ విషయంలో చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ముందుగా అనుకున్నట్టుగానే సినిమాని 140 నుండీ 170 కోట్ల మధ్యలో ఫినిష్ చేయాలని భావిస్తున్నారట. అనవసరమైన హంగులకి పోకుండా సినిమాని కంప్లీట్ చేయాలనీ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సాహో సినిమాకి జరిగిన తప్పులను ఇందులో జరగకుండా చూసుకునేందుకు చిత్ర యూనిట్ జాగ్రత్త పడుతుంది. ఈ సినిమాని వచ్చే ఏడాదిలో విడుదల చేయనున్నారు.

Web TitlePrabhas latest movie budget
Next Story