అతనిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ ....

అతనిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ ....
x
Highlights

సినిమా భరించలేని విధంగా ఉందని , డబ్బులు , అవకాశం , టాలెంట్ అన్ని వృధా అయిపోయాయని సినిమాలో బలహీనమైన కథ , గందరగోలమైన కథనం , మేచురిటి లేని దర్శకత్వం అంటూ సినిమాకి 1/2 రేటింగ్ ఇచ్చాడు .

ఎన్నో అంచనాల మధ్య ప్రభాస్ చిత్రం సాహో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొత్తం ఈ సినిమాని నాలుగు బాషల్లో విడుదల చేసారు. భారీ బడ్జెట్ సినిమా కావడం బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరవాత ప్రభాస్ నుండి వస్తున్న చిత్రం కావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. అందరి అంచనాలకు తెర దించుతూ సహొ ఈ శుక్రవారం విడుదలయ్యింది . ప్రేక్షకుల నుండి సినిమాపై టాలీవుడ్ లో మిక్సి డ్ టాక్ వస్తుంది. అయితే బాలీవుడ్ లో మంచి క్రిటిక్ గా పేరుపొందిన తరుణ్ ఆదర్శ్ మాత్రం సాహో పైన పూర్తి స్థాయిలో విమర్శించారు .



సినిమా భరించలేని విధంగా ఉందని , డబ్బులు , అవకాశం , టాలెంట్ అన్ని వృధా అయిపోయాయని సినిమాలో బలహీనమైన కథ , గందరగోలమైన కథనం , మేచురిటి లేని దర్శకత్వం అంటూ సినిమాకి 1/2 రేటింగ్ ఇచ్చాడు . అయితే అతను ఇచ్చి రివ్యూపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు . గతంలో అయన ఇచ్చిన సినిమా రివ్యూలను బయటకు తీసి మరి ఆయనని విమర్శిస్తున్నారు . సల్మాన్ ఖాన్ నటించిన భారత్ అనే సినిమాకి గాను నువ్వు 4 రేటింగ్ ఇచ్చావ్ మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది మరి దీనికి ఎం సమాధానం చెప్తావ్ అంటూ ప్రశ్నిస్తున్నారు . అంతే కాకుండా షారుక్ ఖాన్ నటించన ఫ్యాన్ సినిమాకి గాను 3.5 రేటింగ్ ఇచ్చావ్ మరి ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యిందని దీనిపైన ఏమని వివరణ ఇస్తావ్ అని ప్రభాస్ ఫ్యాన్స్ అయనపై విరుచుక పడుతున్నారు .



Show Full Article
Print Article
More On
Next Story
More Stories