ఈశ్వర్ సినిమా ప్రభాస్ ది కాదట ... !

ఈశ్వర్ సినిమా ప్రభాస్ ది కాదట ... !
x
Highlights

బాహుబలి సినిమాతో ప్రభాస్ స్టార్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు అండతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికి నటించిన కొన్ని...

బాహుబలి సినిమాతో ప్రభాస్ స్టార్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు అండతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికి నటించిన కొన్ని సినిమాలతోనే యంగ్ రెబల్ స్టార్ గా ఎదిగాడు ప్రభాస్.. నిజానికి ప్రభాస్ కి ముందుగా సినిమాల్లో నటించాలని లేదట.. ! పెద్దయ్యాక ఏదైనా వ్యాపారం,ఉద్యోగం చేసుకోవాలని అనుకున్నారట. కానీ ఫ్రెండ్స్ హీరో హీరో అనేవారట..

ఇక ఒకసారి ఇంట్లో హీరో అవుతాను అని చెప్పడంతో అందరు షాక్ అయ్యారట..! దీనితో వైజాగ్ లో సత్యానంద్ దగ్గర నటనలో మెలుకువలు నేర్చుకునేందుకు వెళ్లారట ప్రభాస్.. ఇక అప్పుడే నిర్మాత అశోక్ కుమార్ దర్శకుడు జయంత్ సి పరాన్జీతో ఓ సినిమా చేద్దామని ఆలోచనలో ఉన్నారట. ఆ క్రమంలో హీరోగా తరుణ్ ని అనుకున్నారట..దీనికి తరుణ్ కూడా సుముఖత వ్యక్తం చేసాడట.. కానీ సినిమా చేద్దామని స్పష్టత ఇవ్వకపోవడంతో అశోక్ కుమార్ కొడుకునే హీరోగా పెట్టి సినిమా తీద్దామని జయంత్ సి పరాన్జీ అన్నారట కానీ అప్పుడు అశోక్ కుమార్ కొడుకు చదువుకుంటూ ఉండడంతో దీనికి ఒప్పుకోలేదట..

ఇక అప్పుడే సత్యానంద్ దగ్గర శిక్షణ తీసుకుంటున్న ప్రభాస్ గురించి అశోక్ కుమార్ కి తెలియడంతో ప్రభాస్ కలిశారట.. దీనికి ప్రభాస్ కూడా ఒప్పుకున్నారట.. ఫోటో షూట్ కూడా చేశా ఒకే చేసారట.. కానీ అదే టైంలో అల్లు అరవింద్ అబ్బాయి అల్లు అర్జున్ కూడా సినిమాలో నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని తెలియడంతో అల్లు అర్జున్ ఫొటోస్ కూడా తెప్పించారట.. ఇక ఈ సమయంలో సినిమా పెద్దలందరిని కూర్చోబెట్టి సినిమా కథని చెప్పి దీనికి ఎవరు బాగుంటారు అని అడిగితే అందరు ప్రభాస్ అని చెప్పడంతో ఈశ్వర్ సినిమా తెరపైకి వచ్చింది. ప్రభాస్ తో పాటు ప్రముఖ సంగీత దర్శకుకుడు ఆర్. పి. పట్నాయక్ హీరోయిన్ శ్రీదేవిలు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories