పునర్జన్మలతో కథ : ప్రభాస్ తో కాజల్ ?

పునర్జన్మలతో కథ : ప్రభాస్ తో కాజల్ ?
x
ప్రభాస్, కాజల్ ఫైల్ ఫోటో
Highlights

సాహో సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా 'జిల్' ఫేం కే. రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.

సాహో సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా 'జిల్' ఫేం కే. రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. సాహో సినిమాని నిర్మించిన యువీ క్రియేషన్స్ వారే ఈ సినిమాని కూడా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ కి జోడిగా పూజా హేగ్దే నటిస్తుంది. పునర్జన్మల నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ కూడా నటిస్తుందని తెలుస్తుంది. కొన్ని కీలక సన్నివేశాల్లో ప్రభాస్ తో కాజల్ కనిపిస్తుందని టాలీవుడ్ సర్కిల్ లో చర్చ నడుస్తుంది.

ప్రభాస్- కాజల్ ది ఇండస్ట్రీలో హిట్ పెయిర్.. ఇప్పటికే డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి చిత్రాలలో నటించి ఈ జోడి ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాతో ఈ జోడి ముచ్చటగా మూడో సారి జత కట్టనుంది అని వార్తలు వస్తున్నాయి. దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. సాహో సినిమా తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories