త్వరలోనే రామ్ చరణ్ తో సినిమా ఉంటుంది : పవన్ కళ్యాణ్

త్వరలోనే రామ్ చరణ్ తో సినిమా ఉంటుంది : పవన్ కళ్యాణ్
x
pawan kalyan
Highlights

టాలీవుడ్ స్టార్ హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకరు. హిట్టు ప్లాప్ లతో సంబంధం లేకుండా ఆయనకి ఫ్యాన్స్ ఉండడం పవన్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పవన్...

టాలీవుడ్ స్టార్ హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకరు. హిట్టు ప్లాప్ లతో సంబంధం లేకుండా ఆయనకి ఫ్యాన్స్ ఉండడం పవన్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పవన్ రాజకీయాలలో ఉండడం వలన సినిమాలను చేయడం లేదు. ఇక బాలీవుడ్ లో మంచి హిట్టు అయిన పింక్ సినిమాని తెలుగులో పవన్ రీమేక్ చేస్తున్నారని, ఈ సినిమాని బోని కపూర్, దిల్ రాజులు నిర్మిస్తారని, వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చాయి.

అయితే వీటిపై ఇటు ప‌వ‌న్ నుండి కాని అటు చిత్ర బృందం నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. ఇటీవ‌ల పింక్ రీమేక్ ప‌నులు కూడా మొద‌ల‌య్యాయి. కానీ పవన్ మాత్రం హీరోగా నటిస్తానో లేదో తెలియదు కానీ సినిమాలని మాత్రం నిర్మిస్తానని, తనకి సినిమా తప్ప మరేమీ తెలియదని ఇప్పటికే చెప్పుకొచ్చారు. ఆదాయ వ‌న‌రు కోసం నేను సినిమాలు నిర్మిస్తానని పవన్ స్పష్టం చేశారు.

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న పవన్ రామ్ చ‌ర‌ణ్‌తో సినిమాపై స్పందించారు.. రామ్ చరణ్ తో సినిమా ఖచ్చితంగా ఉంటుందని, కానీ సినిమాకి తాలుకు కథ, ద‌ర్శకుడు ఇంకా దొర‌క‌లేదు కాబ‌ట్టి లేట్ అవుతుందని చెప్పుకొచ్చారు. అన్నీ కుదిరితే రామ్‌చ‌ర‌ణ్‌తో త్వర‌లోనే సినిమా పక్కా ఉంటుదని చెప్పుకొచ్చాడు ప‌వ‌న్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories