పవన్‌ను పెళ్లి చేసుకోకపోయినా.. అది జరిగేదే..: రేణు దేశాయ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ''ఏ లవ్ అన్ కండిషనల్'' అనే పుస్తకం రాశారు. ఈ పుస్తకం వివాదాన్ని రేపుతోంది. ఈ నేపథ్యంలో తాను ఈ పుస్తకాన్ని పవన్‌ను ఉద్దేశించి రాయలేదని రేణు క్లారిటీ ఇచ్చారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ''ఏ లవ్ అన్ కండిషనల్'' అనే పుస్తకం రాశారు. ఈ పుస్తకం వివాదాన్ని రేపుతోంది. ఈ నేపథ్యంలో తాను ఈ పుస్తకాన్ని పవన్‌ను ఉద్దేశించి రాయలేదని రేణు క్లారిటీ ఇచ్చారు. బాధతో రాసినా, ఆనందంతో రాసినా రొమాంటిక్‌గా రాసినా.. ప్రతి ఒక్కరూ పవన్ కల్యాణ్ గురించేనని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రతి వ్యక్తి జీవితంలోనూ సంతోషం, సుఖం, దుఖః ఉంటాయని, తన జీవితంలోనూ అవన్నీ ఉన్నాయని చెప్పుకొచ్చారు. 'ఏ లవ్ అన్ కండిషనల్' పుస్తకాన్ని పాటల రచయిత అనంత శ్రీరామ్ తెలుగులోకి అనువదించగా, ఇది చదివిన ప్రతి ఒక్కరూ రేణూ దేశాయ్ పై జాలి చూపిస్తున్న సమయంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 2014లో తనకు అనారోగ్యం ఏర్పడినప్పుడు రచనా వ్యాసాంగంపై ఆసక్తి పుట్టిందని, అప్పటి నుంచే తాను ట్విట్టర్ లో ఉన్నానని చెప్పుకొచ్చారు రేణు. తాను రచించింది తన మనసులోని మాటలే తప్ప ఎవరినీ ఉద్దేశించినవి కాదని అన్నారు. తాను 12 ఏళ్ల పాటు పవన్‌తో సంసారం చేశానని ఆయనతో కలిసి ఇద్దరు బిడ్డలకు తల్లినయ్యానని చెప్పింది. ఒకవేళ ఆయనతో కాకుంటే ఇంకొకరితో తనకు వివాహం జరిగేదని వారితో బిడ్డల్ని కనివుండేదాన్ని అంటూ వ్యాఖ్యానించారు. తన అనుభవాలనే కవితలుగా మార్చానని, వీటిని తెలుగులోకి అనువదించేందుకు సహకరించిన అనంత శ్రీరామ్‌కు కృతజ్ఞతలని వెల్లడించారు.
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
తిరుమల శ్రీవారికి అరకు లోయ పసుపు..
21 May 2022 8:45 AM GMTమళ్లీ అదే పొరపాటు చేసిన విశ్వక్ సేన్...
21 May 2022 8:30 AM GMTమాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31వ వర్ధంతి.. వీర్‌భూమిలో ఘన నివాళి...
21 May 2022 8:08 AM GMTమా అన్నయ్య వాళ్లను కూడా నడి రోడ్డుపై చంపాలి - నీరజ్ భార్య సంజన
21 May 2022 7:43 AM GMTబేగంబజార్‌లో నీరజ్ హత్యను ఖండించిన ఎమ్మెల్యే రాజాసింగ్...
21 May 2022 7:28 AM GMT