ఫ్యాన్స్‌కు ప‌వ‌న్ బిగ్ షాక్?

ఫ్యాన్స్‌కు ప‌వ‌న్ బిగ్ షాక్?
x
vakeelsaab
Highlights

రాజకీయాల వల్ల రెండేళ్లుగా సినిమాలకి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే పవన్ రీఎంట్రీ మూవీగా `వ‌కీల్‌సాబ్‌` తెరకెక్కుతుంది. హిందీలో వచ్చిన పింక్ సినిమాకి ఇది రీమేక్ .

రాజకీయాల వల్ల రెండేళ్లుగా సినిమాలకి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే పవన్ రీఎంట్రీ మూవీగా `వ‌కీల్‌సాబ్‌` తెరకెక్కుతుంది. హిందీలో వచ్చిన పింక్ సినిమాకి ఇది రీమేక్ ..ఇందులో అంజలి, నివేతా థామస్, అనన్య పాండే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, బోనీ క‌పూర్‌, దిల్ రాజుకలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు..ప్రస్తుతం శేరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాని మే 15న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటికే సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ ని విడుదల చేయగా ఎక్కడలేని రెస్పాన్స్ వస్తోంది. త్వరలో టీజర్ కూడా రానుంది!ఈ సినిమా కోసం అభిమానులు మాత్రమే కాదు సినీ ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తుంది. ఈ నేపధ్యంలో అనుకున్న సమయానికి `వ‌కీల్‌సాబ్‌` ప్రేక్షకుల ముందుకు రావడం అనుమానంగానే కనిపిస్తోంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఈ సినిమాకి పవన్ ఇచ్చిన డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతున్నారట.. దీనితో ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అయన పార్టీ జనసేన ఘోరంగా ఓడిపోవడంతో పవన్ స్థానిక ఎన్నికలపై ఫోకస్ పెట్టారు.

.ఇక వకీల్ సాబ్ సినిమా తరవాత పవన్ వరుసపెట్టి సినిమాలు చేసేందుకు సిద్దం అయ్యారు. ఇప్పటికే క్రిష్ డైరెక్షన్లో ఓ సినిమాని పవన్ లైన్ లో పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా కూడా శేరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఎఎం రత్నం ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక దీని తర్వాత పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక పూరి, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు పవన్ సిద్దం అయ్యారని తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories