వకీల్ సాబ్ ... వర్క్ ఫ్రమ్ హోం

వకీల్ సాబ్ ... వర్క్ ఫ్రమ్ హోం
x
Pawan Kalyan
Highlights

అజ్ఞాతవాసి సినిమా తర్వాత రెండు సంవత్సరాలు సినిమాలకి బ్రేక్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే..

అజ్ఞాతవాసి సినిమా తర్వాత రెండు సంవత్సరాలు సినిమాలకి బ్రేక్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.. పవన్ రీఎంట్రీ మూవీగా హిందీలో మంచి హిట్ అయిన పింక్ సినిమాకి రీమెక్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, బోని కపూర్, దిల్ రాజు కలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. పవన్ షూటింగ్ లో పాల్గొన్న కొన్ని క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

దాదాపుగా 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని మే మొదటివారంలో రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ కరోనా నేపధ్యంలో సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే వచ్చిన ఈ గ్యాప్ ని చిత్ర యూనిట్ సద్వీనియోగం చేసుకుంటుందట.. ఇప్పటి వరకు అయిన షూటింగ్ పార్ట్ ని ఎడిటింగ్ ని పూర్తి చేసే పనిలో పడిందట!... అంతేకాకుండా పవన్ తన పాత్రకి డబ్బింగ్ కూడా చేపుతున్నాడని తెలుస్తోంది, ఇక లాక్ డౌన్ ముగిసిన వెంటనే మిగిలిన పార్ట్ ని కంప్లీట్ చేసి సినిమాని అనుకున్న టైంకి రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తుందట. చూడలి మరి ఎం జరుగుతుందో..

ఇక ఈ సినిమా తరవాత పవన్ వరుసపెట్టి సినిమాలు చేసేందుకు సిద్దం అయ్యారు. ఇప్పటికే క్రిష్ డైరెక్షన్లో ఓ సినిమాని పవన్ లైన్ లో పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా కూడా శేరావేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఎఎం రత్నం ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక దీని తర్వాత పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక పూరి, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు పవన్ సిద్దం అయ్యారని తెలుస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories