మరోసారి తెరపైకి పవన్ సాంగ్

మరోసారి తెరపైకి పవన్ సాంగ్
x
Missmatch movie
Highlights

ఓల్డ్ సాంగ్ ని రీక్రియేట్ చేయడం అనేది కొత్తదేమీ కాదు. చాలా సినిమాల్లో పాత పాటలను రీమేడ్ చేసి శభాష్ అని అనిపించానుకున్నారు దర్శకనిర్మాతలు.

ఓల్డ్ సాంగ్ ని రీక్రియేట్ చేయడం అనేది కొత్తదేమీ కాదు. చాలా సినిమాల్లో పాత పాటలను రీమేడ్ చేసి శభాష్ అని అనిపించుకున్నారు దర్శకనిర్మాతలు..ఈ నేపద్యంలో గతంలో ప్రేమికులను ఉర్రూతలూగించిన సాంగ్ ని ఇప్పుడు మళ్లీ తెరపైకి తీసుకురాబోతున్నారు. హీరో పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలోని అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్టే.. ఇందులో పవన్ కి జోడిగా కీర్తి రెడ్డి నటించింది. కరుణాకరన్ దర్శకత్వం వహించారు.

అయితే ఇప్పుడు ఈ సినిమాలోని "ఈమనసే సే.. సే.. సే..." అనే పాటను రీమేడ్ చేశారు. ఆటగాదరా శివ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయిన ఉదయ్ శంకర్ హీరోగా తెరకెక్కుతున్న మిస్ మ్యాచ్ సినిమాలో ఈ పాటను రీమేడ్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఈ పాటను హీరో పవన్ కళ్యాణ్ కి డెడికేడ్ చేస్తునట్లు తెలిపారు చిత్రబృందం.. త్వరలో పూర్తి సాంగ్ ని విడుదల చేయనున్నారు.

తాజాగా ఈ సినిమాకి సంబంధిచిన మొదటి సాంగ్ ని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రిలీజ్ చేశారు. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి నిర్మల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories