క్రిష్ మూవీ నుంచి పవన్ లుక్ లీక్ ..

క్రిష్ మూవీ నుంచి పవన్ లుక్ లీక్ ..
x
pawan kalyan (File Photo)
Highlights

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలతో ఇటు సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపైన ఫోకస్ చేస్తూనే వరుసపెట్టి సినిమాలకు సైన్ చేస్తున్నారు పవర్ స్టార్.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలతో ఇటు సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపైన ఫోకస్ చేస్తూనే వరుసపెట్టి సినిమాలకు సైన్ చేస్తున్నారు పవర్ స్టార్.. ఇప్పటికే పవన్ రీఎంట్రీ మూవీగా 'వకీల్ సాబ్' అనే సినిమా తెరకెక్కుతుంది. ఇది పవన్ కి 26 వ చిత్రం.. హిందీలో వచ్చిన పింక్ సినిమాకి ఇది రీమేక్ ..ఇందులో అంజలి, నివేతా థామస్, అనన్య పాండే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, బోనీ క‌పూర్‌, దిల్ రాజుకలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు..ప్రస్తుతం శేరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని మే 15న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇక వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ మరో సినిమాని చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శేరవేగంగా జరుపుకుంటోంది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత ఎఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి లీకైన పవన్ పిక్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో పవన్ కళ్యాణ్ నుదిటిన పొడవాటి ఎర్ర బొట్టు పెట్టుకుని చాలా గంభీరంగా కనిపిస్తున్నాడు.


పవన్ రీఎంట్రీగా తెరకెక్కుతున్న సినిమా వకీల్ సాబ్ షూటింగ్ మొదలైనప్పుడు పవన్ కళ్యాణ్ అలా నడుచుకుంటూ వెళ్తున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా చిత్ర యూనిట్ కూడా సినిమా సంబంధించిన ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు క్రిష్ సినిమా నుంచి లీకైన ఈ పిక్ కూడా అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాని దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నారు పవన్ కళ్యాణ్ .. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇక పూరి జగన్నాధ్, త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించేందుకు పవన్ సిద్దంయ్యరని తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories