మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ...

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ...
x
Highlights

ఇది మెగా ఫాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి .. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా సినిమా ఆడియో వేడుకను ఈ నెల 18 న ఎల్బీ స్టేడియం లో గ్రాండ్ గా...

ఇది మెగా ఫాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి .. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా సినిమా ఆడియో వేడుకను ఈ నెల 18 న ఎల్బీ స్టేడియం లో గ్రాండ్ గా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు . ఈ ఆడియో వేడుకకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు . దీనితో ఇటు మెగాస్టార్ ఫ్యాన్స్ , పవర్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు .

ఇప్పటికే సైరా సినిమాకి పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ని అందించారు . ఇక చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న పవన్ సినిమా గురించి చిరంజీవి గురించి మాట్లాడారు . అన్నదమ్ములు ఇద్దరు ఒకే వేదికపై చాలా రోజుల తర్వాత కనిపించడంతో ఈ ఆడియో వేడుకపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది . సైరా సినిమాని రామ్ చరణ్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు . ఈ సినిమాలో చిరు సరసన నయనతార నటిస్తుంది . అమితాబ్ బచ్చన్ , విజయ సేతుపతి , సుదీప్ , తమన్నా , నిహారిక ముఖ్యపాత్రలో నటిస్తున్నారు .ఈ సినిమాని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండున విడుదల చేయనున్నారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories