పవన్ కళ్యాణ్ సరసన మరోసారి కాజల్!

పవన్ కళ్యాణ్ సరసన మరోసారి కాజల్!
x
Pawan Kalyan, Kajal Agarwal (File Photo)
Highlights

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఇది పవన్ కళ్యాణ్ కి 28 వ చిత్రం కావడం విశేషం.. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నీ చిత్రబృందం ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్, కాజల్ అగర్వాల్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ ఏడాది చివర్లో సినిమా పట్టాలెక్కనుంది. అయితే ఇందులో మరో హీరో కూడా నటించనున్నట్లు సమాచారం. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని బోనీ కపూర్ దిల్ రాజు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.. మేలో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో పవన్ సరసన అంజలి, నివేద థామస్, అనన్య పాండే నటిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడింది. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇక అటు కాజల్ అగర్వాల్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories