హరీష్ డైరెక్షన్ లో పవన్ .. మరోసారి తెరపైకి గబ్బర్ సింగ్ కాంబో

హరీష్ డైరెక్షన్ లో పవన్ .. మరోసారి తెరపైకి గబ్బర్ సింగ్ కాంబో
x
Highlights

నేను ట్రెండ్ ఫాలో అవను.. ట్రెండ్ సెట్ చేస్తా అని గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ నిజంగానే ట్రెండ్ సెట్ చేసింది.

నేను ట్రెండ్ ఫాలో అవను.. ట్రెండ్ సెట్ చేస్తా అని గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ నిజంగానే ట్రెండ్ సెట్ చేసింది. అప్పటివరకు ఉన్న రికార్డులను బద్దులు కొట్టి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇక అప్పటివరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక్క హిట్ కావాలని కోరుకుంటే ఈ సినిమా ఏకంగా ఇండస్ట్రీ హిట్ నే ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ కాంబోలో మరో సినిమా రానుంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. సాంకేతిక నిపుణులు, నటినటులు గురించి త్వరలో వెల్లడించనున్నారు.

హిందీలో మంచి హిట్ అయిన దబాంగ్ సినిమాని గబ్బర్ సింగ్ గా రీమేక్ చేశాడు హరీష్.. అందులో పవన్ ని పోలీస్ ఆఫీసర్ గా చూపించి సక్సెస్ అయ్యాడు. మళ్ళీ ఈ సినిమాలో పవన్ ని ఎలా చూపించానున్నాడన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. వీరి కాంబినేషన్ నుంచి సినిమా వస్తుండడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ లో ఎక్కడలేని క్రేజ్ ఏర్పడింది.. ఫ్యాన్స్ కూడా తమ అభిమాన నటుడుకి ఇండస్ట్రీ హిట్ కావాలని ఆశపడుతున్నారు. హరీష్ కూడా పవన్ ఫ్యాన్ కావడంతో సినిమా రికార్డుల మోత మోగడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ కి ఇది 28 వ సినిమా కావడం విశేషం..



ఇక పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత సినిమాలకి బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. పవన్ రీఎంట్రీ మూవీగా లాయర్ సాబ్ అనే సినిమా తెరక్కుతుంది. హిందీలో మంచి హిట్ అయిన పింక్ సినిమాకి ఇది రీమేక్ .. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు, బోనికపూర్ కలిసి నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. మే 23 న సినిమాని రిలీజ్ చేయనున్నారు.

ఇక క్రిష్ దర్శకత్వంలో పవన్ మరో సినిమా ప్రారంభం అయింది. స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారని వినికిడి.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది. ఇక హరీష్ శంకర్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ పూరి డైరెక్షన్ లో మరో సినిమాని చేయనున్నారని తెలుస్తోంది. సినిమాలకి కస్తా గ్యాప్ ఇచ్చినప్పటికి పవన్ ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేస్తుండడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories