Pink Remake: పవన్ ఫస్ట్ లుక్ ఇదే అంటూ ఫ్యాన్స్ హాల్ చల్

Pink Remake: పవన్ ఫస్ట్ లుక్ ఇదే అంటూ ఫ్యాన్స్ హాల్ చల్
x
pawan kalyan (file photo)
Highlights

అజ్ఞాతవాసి సినిమా తర్వాత సినిమాలకి బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లోకి వెళ్ళిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ చకచక సినిమాలు చేస్తున్నారు.

అజ్ఞాతవాసి సినిమా తర్వాత సినిమాలకి బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లోకి వెళ్ళిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ చకచక సినిమాలు చేస్తున్నారు. పవన్ రీఎంట్రీ మూవీగా హిందీలో మంచి హిట్ అయిన పింక్ సినిమాకి రీమెక్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, బోని కపూర్, దిల్ రాజు కలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని వచ్చే నెల మార్చ్ 2 న రిలీజ్ చేయనున్నారు. ఇక మొదటిపాటను మహిళా దినోత్సవం సందర్భంగా మార్చ్ 8 న రిలీజ్ చేయనునట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

అయితే తమ అబిమాన హీరోకి సంబంధించిన మొదటిలుక్ విడుదలవుతుందన్న వార్త తెలియగానే ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే కొందరు డై హార్డ్ ఫ్యాన్స్ మాత్రం పవన్ లుక్ ఇదేనని ఫ్యాన్ మెడ్ పోస్టర్స్ ని రిలీజ్ చేసి ట్విట్టర్ లో వదిలారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ప్రస్తుతం #PSPK26FirstLook అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌ ట్రెండింగ్‌లో ఉంది. ఈ సినిమాకి వకిల్ సాబ్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇందులో అంజలి, నివేతా పెతురాజ్, అనన్య పాండే నటిస్తున్నారు. సినిమాని మే 25 న రిలీజ్ చేయనున్నారు.

ఇక ఈ సినిమా తరవాత పవన్ వరుసపెట్టి సినిమాలు చేసేందుకు సిద్దం అయ్యారు. ఇప్పటికే క్రిష్ డైరెక్షన్లో ఓ సినిమాని పవన్ లైన్ లో పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా కూడా శేరావేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఎఎం రత్నం ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక దీని తర్వాత పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక పూరి, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు పవన్ సిద్దం అయ్యారని తెలుస్తోంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories