పాలకొల్లులో పవన్ ఫిలిం ఇనిస్టిట్యూట్!

పాలకొల్లులో పవన్ ఫిలిం ఇనిస్టిట్యూట్!
x
Highlights

దిగ్గజాలను తెలుగు తెరకు అందించిన పాలకొల్లు పట్టణంలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ను ప్రారంభించనున్నట్టు జనసేన పార్టీ ప్రకటించింది. ఎస్వీ రంగారావు ఫిల్మ్...

దిగ్గజాలను తెలుగు తెరకు అందించిన పాలకొల్లు పట్టణంలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ను ప్రారంభించనున్నట్టు జనసేన పార్టీ ప్రకటించింది. ఎస్వీ రంగారావు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ గా ఈ సంస్థకు పేరు పెట్టినట్టు వెల్లడించింది. అల్లురామలింగయ్య, దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ పాలకొల్లు నుంచే వచ్చారని వివరించింది. పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ ఈ విషయాలను తెలిపారు. ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కు హరిరామ జోగయ్య చైర్మన్ గా వ్యవహరిస్తారని చెప్పారు.

రాజా వన్నెంరెడ్డి, బన్నీవాసు నేతృత్వంలో ఈ ఇన్ స్టిట్యూట్ నడుస్తుందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల యువతకు ఉపయోగపడేలా ఈ సంస్థను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ ఇన్ స్టిట్యూట్ లో నటన, దర్శకత్వంలో శిక్షణ ఇస్తామని చెప్పారు. ఈ ఇన్ స్టిట్యూట్ ప్రిన్సిపాల్ గా రాజా వన్నెంరెడ్డి వ్యవహరిస్తారనీ, సంస్థ ప్రారంభోత్సవానికి పవన్ కల్యాణ్ వస్తారని ప్రకటించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories