సైరా సినిమాలో పవన్ సీన్ అదే

సైరా సినిమాలో పవన్ సీన్ అదే
x
syeraa
Highlights

మెగాస్టార్, పరుచూరి బ్రదర్స్ డ్రీం ప్రాజెక్ట్ గా సైరా సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహ రెడ్డిగా

మెగాస్టార్, పరుచూరి బ్రదర్స్ డ్రీం ప్రాజెక్ట్ గా సైరా సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహ రెడ్డిగా నటించి మెప్పించారు. రామ్ చరణ్ 350 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా సినిమాని తెలుగు, హిందీ, తమిళ్ , కన్నడ, మలయాళీ భాషల్లో విడుదల చేశారు. బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

అయితే ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఉంటుందని అందరు అనుకున్నారు. ఓ కీలక పాత్రలో పవన్ నటిస్తాడని అనుకున్నారంతా. కానీ ఆయన సినిమాకి వాయిస్ ని మాత్రమే అందించారు. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కోసం ఓ సన్నివేశాన్ని రాసుకున్నారట కథ రచయితలు పరుచూరి బ్రదర్స్.. పరుచూరి పలుకుల్లో భాగంగా ఆ సన్నివేశాన్ని గురించి చెప్పుకొచ్చారు పరుచూరి గోపాలకృష్ణ.

సైరా సినిమా చివరలో ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి తల నరికిన అనంతరం అతడి రక్తపు చుక్కలు కింద పడుతుంటే నరసింహ రెడ్డి తల్లి వచ్చి వాటిని చీర చెంగులో పట్టుకుంటుంది. అప్పుడు ఆమె ఆ తల్లి లక్షమంది పుడతారంటూ అంటూ చెపుతుంది. ఇదంతా సినిమాలో చూసిందే.. కానీ ఆ తర్వాత ఆ లక్షమందిలో నుంచి ఓ ఐదుగురుని చూపిస్తూ అలా ఓ 2 కాళ్లు అలా నడుచుకుంటా కొండపైకి వెళ్తాయి. ఆ కాళ్లు ఎవరు..ఎవరు.. అని అంతా చూస్తుంటారు. అలా తిరిగేసరికి పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు. అలా ఆకాశంవైపు చూసి పెద్దాయన అంటాడు. ఆ మబ్బుల్లోంచి చిరంజీవి రూపం వస్తుంది. అప్పుడు చిరంజీవి మీసం తిప్పుతారు. అక్కడ పవన్ కు 2 డైలాగ్స్ ఉంటాయి. చూడు పెద్దాయన నీ కష్టం, నీ రక్తపు చుక్క వృధా పోలేదు. నువ్వు కన్న కల నెరవేరడానికి వంద సంవత్సరాలు పట్టింది. అలా స్వేచ్ఛగా ఎగురుతున్న భారతదేశ జెండాని చూడు అనగానే నరసింహ రెడ్డి జాతీయ జెండాను చూడడంతో సినిమాకి శుభం కార్డు పడుతుంది.

ఇది తాను రాసుకున్న సన్నివేశమని అన్నారు పరుచూరి. కానీ ఆ సన్నివేశం పెట్టడానికి చిరంజీవి ఒప్పుకోలేదన్నారు. ఇక చరణ్ కి చెబితే చిరంజీవి ఒప్పుకుంటే చేస్తానని చెప్పాడని గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు. సినిమాలో ఈ ఒక్క సీన్ ఉన్నట్టు అయితే తను నూరుపాళ్లు సంతోషం వ్యక్తం చేసేవాడినని అన్నారు. పవన్ కనిపించకపోయినా ఆయన గొంతు వినిపించినందుకు సంతోషమన్నారు. అంతేకాకుండా సినిమాలో చేసిన కొన్ని మార్పులు, లేన్త్ కారణంగా తీసివేసిన సన్నివేశాలను చెప్పుకొచ్చారు గోపాలకృష్ణ..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories