సాహో పై పరుచూరి కామెంట్స్

సాహో పై పరుచూరి కామెంట్స్
x
Highlights

ప్రభాస్ నటించిన తాజా చిత్రం సాహో ... బాహుబలి సినిమా తర్వాత సాహో సినిమా రావడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకి ప్రేక్షకుల నుండి...

ప్రభాస్ నటించిన తాజా చిత్రం సాహో ... బాహుబలి సినిమా తర్వాత సాహో సినిమా రావడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకి ప్రేక్షకుల నుండి మిక్సుడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం సాహో సినిమా దుమ్ములేపిందనే చెప్పాలి. అయితే ఈ సినిమా గురించి ప్రముఖ రచయత పరుచూరి గోపాలకృష్ణ స్పందించారు. సినిమాపైన అయన ఎం అన్నారో అయన మాటల్లోనే ...

"సాహో సినిమా అందరితో ఓహో అనిపించాలని అనుకున్నా ... కానీ అన్ని విషయాల్లో కాకపోయిన కొన్ని విషయాల్లో మాత్రం ఓహో అనిపించింది. ముఖ్యంగా సినిమాకి టెక్నిషన్స్ పడ్డ శ్రమ ఓ అద్బుతామని చెప్పాలి.. మొదటి నేను 'సాహో' చిత్రం జేమ్స్ బాండ్ తరహా చిత్రం అనుకున్నాను. లొపలికి వెళ్లి చూస్తే ఆది జేమ్స్ బాండ్ సినిమా కాదు . 'సాహో' కథాంశం 'బాహుబలి' ...'బాహుబలి' లో తండ్రిని చంపిన వాడిని కొడుకు హతమార్చి సింహాసనం అధిరోహిస్తాడు.. ఇక 'సాహో' లో కూడా అంతే. సినిమాలో చాలా పొరపాట్లు ఉన్నాయి. ఇక సినిమా క్లైమాక్స్ కూడా భారీ నిడివితో కూడుకొని ఉంది. ఏది ఏమైనప్పటికి సాహో చిత్రానికి పెట్టిన డబ్బులు రావడం సినిమా కూడా మంచి కలెక్షన్లు రాబట్టడం శుభపరిణామం అని గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు ."


Show Full Article
Print Article
More On
Next Story
More Stories