పవన్ సినిమాని అలా తీయొద్దు: పరుచూరి

పవన్ సినిమాని అలా తీయొద్దు: పరుచూరి
x
Highlights

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.. . బాలీవుడ్‌లో మంచి హిట్ అయిన పింక్ సినిమాని పవన్ తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.. . బాలీవుడ్‌లో మంచి హిట్ అయిన పింక్ సినిమాని పవన్ తెలుగులో రీమేక్ చేస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు, బోని కపూర్ కలిసి నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు 'వకీల్ సాబ్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. పవన్ సరసన అంజలి, నివేతా థామస్, అనన్య పాండేలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాపైన ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ స్పందించారు.

" స్వరాజ్య పోరాటాన్ని భుజస్కంధాలపైన మోసిన మహానుభావులైన లాయర్లకు నమస్కారాలు.. పవన్ కళ్యాణ్ చేస్తున్న పింక్ సినిమా ఓ లాయర్ కథ.. నేను హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన 'పింక్', తమిళ్ లో అజిత్ నటించిన 'నేర్కొండ పార్వాయ్' సినిమాలని చూశాను. ఈ సినిమాలని చూస్తుంటే రెండింటిలోను మెయిన్ కీ పాయింట్ వదిలేశారు. ఓ అమ్మాయిని కిడ్నా్ప్ చేసిన సమయంలో సీసీ కెమెరాల సాయం కూడా తీసుకోకపోవడం. కాబట్టి ఈ సన్నివేశాన్ని పవన్ సినిమాలో పవన్ కి తగ్గట్టుగా పెట్టి పోలీసులు నిర్లక్ష్యాన్ని కోర్టులో పవన్ వాదించినట్టుగా చూపిస్తే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇక సినిమా మొత్తం 80 శాతం కోర్టులోనే ఉంటుంది. సినిమా మొత్తం ఎక్కువ సంబాషణలతో కూడుకొని ఉంటుంది. కేవలం సంబాషణలు ఉంటే ప్రేక్షకులు ఎంజాయ్ చేయలేరు. కాబట్టి సన్నివేశాలు కూడా ఉండాలి. మళ్ళీ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో చేస్తున్నప్పుడు డైలాగులతో నడిపించేస్తే ఫ్యాన్స్‌కి నచ్చదు.. సినిమా మొదట్లో పవన్ హీరోయిన్‌తో రొమాన్స్, కొన్ని పాటలు అలా హీరోది ఓ చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తే మళ్లీ పవన్ సినిమానే చూస్తున్నట్లు ప్రేక్షకులకి కలుగుతుంది" అని పరుచూరి గోపాలకృష్ణ పేర్కొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories