పలనాటి బ్రహ్మనాయుడులో ఆ సన్నివేశాలని తీసివేద్దాం అనుకున్నాం కానీ...

పలనాటి బ్రహ్మనాయుడులో ఆ సన్నివేశాలని తీసివేద్దాం అనుకున్నాం కానీ...
x
Highlights

తెలుగులో ఎక్కువగా హీరోని హైలేట్ చేస్తుంటారు రచయిత, దర్శకులు.. కొన్ని సార్లు ఇది మెప్పించినా మరికొన్ని సార్లు మాత్రం ఇబ్బంది పెడతాయి. అందులో భాగంగానే...

తెలుగులో ఎక్కువగా హీరోని హైలేట్ చేస్తుంటారు రచయిత, దర్శకులు.. కొన్ని సార్లు ఇది మెప్పించినా మరికొన్ని సార్లు మాత్రం ఇబ్బంది పెడతాయి. అందులో భాగంగానే బాలకృష్ణ నటించిన పలనాటి బ్రహ్మనాయుడు సినిమాలో బాలకృష్ణ తొడగొట్టగానే జయప్రకాశ్ రెడ్డి కూర్చున్న కుర్చీ ముందుకు రావడం, రైలు వెనుకకు పోవడం లాంటి సన్నివేశాలు ప్రేక్షకులను ఇబ్బంది పెట్టాయి. అయితే దీని గురించి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఇలా విశ్లేషించారు.

" బాలకృష్ణ, బి గోపాల్ కాంబినేషన్ కోసం విజయేంద్రప్రసాద్ సింహాద్రి కథను తీసుకువచ్చారు. దానిపైన నేను డైలాగులు రాయడం మొదలు పెట్టాను. ఇంతలో గోపాల్ వచ్చి బాలకృష్ణ గారు కన్నడలో విష్ణు వర్ధన్ నటించిన సినిమాని చేసేందుకు ఒప్పుకున్నారు. దీనిపైన ముందు కసరత్తు చేద్దాం అన్నారు. అప్పుడు సింహాద్రి నుండి బాలయ్య పలనాటి బ్రహ్మనాయుడు సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. ఇందులో బాగా విమర్శలకు గురి అయిన సన్నివేశాలు రెండు ఉన్నాయి. ఒకటి బాలకృష్ణ తోడ కొట్టగానే జయప్రకాశ్ కూర్చున్న కుర్చీ రావడం దానిని అందరం కామెడిగా నవ్వేసాము.. ఇక రెండవది రెండు రైళ్ళు ఎదురుపడ్డప్పుడు బాలకృష్ణ తోడ కొట్టినప్పుడు రైలు వెనుకకి వెళ్ళిపోవడం. ముఖ్యంగా ఈ షాట్ తిసేముందు చాలా ఆలోచించాము. దీనితో బీ గోపాల్ తో మరో షాట్ సెప్టి కోసం తీసి పెడదామని అని చెప్పాను. ఒక రైలు మరో రైలుకు ఎదురువస్తున్న సమయంలో ఆకాశంలో ఉరుములు.. మెరుపులు వచ్చి పలనాటి బ్రహ్మనాయుడిగా ఎన్టీఆర్‌ కనపడతారు. అప్పుడు ఆ రైలు డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేసి రివర్స్‌ పోనిస్తాడు. ఇలా అయితే ఏ గొడవ ఉండదని గోపాల్‌తో చెప్పా. కానీ అయన అసలు ఈ సన్నివేశమే తీసేద్దామని అన్నారు. ముందుగా కథ చెప్పినప్పుడు ఈ సన్నివేశం అందరినీ అలరించింది. దాంతో బాగుంటుందనే ఉద్దేశంతో చివరి నిమిషంలో అలానే ఉంచేశాం. కానీ, ప్రేక్షకులు హర్షించరని అనుకోలేదు అని చెప్పుకొచ్చారు గోపాలకృష్ణ"



Show Full Article
Print Article
More On
Next Story
More Stories