నేను ఇంకా బతికే ఉన్నాను.. తప్పుడు వార్తలు రాయొద్దు : పాక్ నటి ఆవేదన!

నేను ఇంకా బతికే ఉన్నాను.. తప్పుడు వార్తలు రాయొద్దు : పాక్ నటి ఆవేదన!
x
pakistani actress ayeza khan(File photo)
Highlights

తాజాగా పాకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.. ఈ ప్రమాదంలో 99మంది చనిపోయారు.

తాజాగా పాకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.. ఈ ప్రమాదంలో 99మంది చనిపోయారు.అయితే ఈ ప్రమాదంలో ఈ విమాన ప్రమాదంలో పాకిస్తాన్ నటి అయేజా ఖాన్‌ మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఆమె భర్త డానిష్ కూడా ఈ ప్రమాదంలో చనిపోయాడు అంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఆ వార్తలపై నటి అయేజా ఖాన్ స్పందించింది.

ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తానూ ఇంకా బతికే ఉన్నానని వెల్లడించింది.. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. నాతో పాటుగా నా భర్త కూడా బతికే ఉన్నాడని చెప్పుకొచ్చింది. దయచేసి నిజానిజాలు తెలుసుకోకుండా, నిర్ధారణ చేసుకోకుండా అసత్య వార్తలను ప్రచారం చేయొద్దని పేర్కొంది. అలాంటి తప్పుడు వార్తలు రాసే వారిని దేవుడు కచ్చితంగా శిక్షిస్తాడని వెల్లడించింది.

ఇక ఆ విమానంలో తాను ప్రయాణమే చేయలేదని అయేజా ఖాన్ స్పష్టం చేసింది. సో, విమాన ప్రమాదంలో నటి మృతి అనే న్యూస్ ఫేక్ అని తేలిపోయింది. దీంతో హీరోయిన్ అభిమానులు రిలాక్స్ అయ్యారు. అయేజా ఖాన్ పాకిస్తాన్ ప్రముఖ టీవీ నటి. అదూరి ఔరత్, కోయి చాంద్ రక్, తుమ్ కౌన్ పియా లాంటి ప్రముఖ టీవీ షోస్ లో లీడ్ రోల్ పోషించింది. ఇక గతంలోనూ ఇలాంటి వార్తలు వచ్చాయి. బతికి ఉండగానే సెలబ్రేటిలను సోషల్ మీడియా చంపేసింది. ఇలాంటి అనుభవాలను చాలా మంది సెలబ్రేటిలు ఎదురుకొని తమ ఆవేదనని వ్యక్తం చేశారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories