'ఓ డాడీ' ఫుల్ సాంగ్ వదిలారు

omg daddy song
x
omg daddy song
Highlights

థమన్ అందించిన 'ఓ డాడీ' పూర్తి పాట ఈరోజు విడుదలైంది. కృష్ణ చైతన్య ఈ పాటని రాశారు. విడుదలైన కొద్ది నిమిషాలకే

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం 'అల వైకుంఠపురములో..' వీరి కాంబినేషన్ లో ఇది మూడో సినిమా.. గతంలో జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చాయి. దీనితో ఈ సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా నుండి థమన్ అందించిన 'ఓ డాడీ' పూర్తి పాటని బయటకు వదిలారు. కృష్ణ చైతన్య ఈ పాటని రాశారు.

ఈ పాటను ఐదుగురు సింగర్లు ఆలపించడం మరో విశేషం. తెలుగు ర్యాప్‌ని బిగ్ బాస్ ఫేమ్ రోల్ రైడా పాడగా, ఇంగ్లిష్ ర్యాప్‌ని రాహుల్ నంబియార్ ఆలపించారు. ఫిమేల్ ర్యాప్‌ని లేడీ కాష్ పాడారు. బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ప్రధాన గీతాన్ని ఆలపించారు.విడుదలైన కొద్ది నిమిషాలకే ఈ పాటకి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సోషల్ మీడియాలో పాటని బాగా షేర్ చేస్తున్నారు. మరో హిట్టు పాటను తమన్ తన ఖాతాలో వేసుకున్నాడని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి తమన్ అందించిన రెండు పాటలకి మంచి ఆదరణ లభించింది. వచ్చే ఏడాది సంక్రాంతి పండగ సందర్భంగా సినిమాని జనవరి 12 న విడుదల చేయనున్నారు. ఈ సినిమాని 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్', 'గీతాఆర్ట్స్' కలిసి నిర్మిస్తున్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories