ఇంటర్నెట్ ని షేక్ చేసిన ఎన్టీఆర్ భామ

OliviaMorris
x
OliviaMorris
Highlights

అయితే ఇప్పుడు వీరు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నారు. ఇందులో ఇంకా షూటింగ్ లో పాల్గోనని ఎన్టీఆర్ భామ

బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ (వర్కింగ్ టైటిల్ మాత్రమే).. పీరియాడిక్‌ ఫాంటసీ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ 70 శాతం కంప్లీట్ చేసుకున్నట్టుగా చిత్ర యూనిట్ తెలిపింది.

అయితే తాజాగా ఈ చిత్రం నుండి ఎన్టీఆర్ సరసన నటించబోయే కథానాయకను ప్రకటించింది చిత్రబృందం . లండన్‌ బ్యూటీ ఒలివియా మోరీస్‌ను ఎన్టీఆర్‌కు జోడిగా ఫిక్స్ చేసాడు రాజమౌళి.. ఆమెతో పాటు సినిమాలో నటించబోయే విలన్స్ ను కూడా ప్రకటించాడు రాజమౌళి.. ఈ సినిమాలో విలన్‌లుగా రే స్టీవెన్సన్‌, అలిసన్‌ గూడీలు నటిస్తున్నారు.

అయితే ఇప్పుడు వీరు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నారు. ఇందులో ఇంకా షూటింగ్ లో పాల్గోనని ఎన్టీఆర్ భామ ఒలివియా మోరీస్‌ మాత్రం గూగుల్‌లో అతి ఎక్కువ మంది సెర్చ్‌ చేసిన రెండో పేరుగా రికార్డ్‌ సృష్టించింది. రాజమౌళి సినిమా కావడం అందులో ఎన్టీఆర్ హీరోయిన్ కాబట్టి నెటిజన్లు ఆమె గురించి గూగల్ లో వెతకడం మొదలు పెట్టారు.

బాహుబలి సినిమా తర్వాత జక్కన్న చేస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీంగా, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఈ సినిమాని వచ్చే ఏడాది జులై 30 న విడుదల చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories