ఇపుడేం చేయాలో అర్థం కావడం లేదు:సమంత

ఇపుడేం చేయాలో అర్థం కావడం లేదు:సమంత
x
Highlights

నాకిపుడేమి చేయాలో అసలు అర్థం కావడం లేదు. తరువాతి సినిమా చేయాలంటే ఎలాంటి సినిమా చేయాలి? ఎలాంటి కథను ఎంచుకోవాలో తెలీడం లేదు అంటున్నారు సమంత. ఆమె ప్రధాన...

నాకిపుడేమి చేయాలో అసలు అర్థం కావడం లేదు. తరువాతి సినిమా చేయాలంటే ఎలాంటి సినిమా చేయాలి? ఎలాంటి కథను ఎంచుకోవాలో తెలీడం లేదు అంటున్నారు సమంత. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఓ బేబీ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో సినిమా థాంక్స్ మీట్ ను ఏర్పాటు చేశారు. సినిమా టీం తో పాటు హీరో రానా కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమంత ఈ సినిమా విడుదల ముందు రోజు అసలు నిద్ర పోలేదు. మొదటి రోజు నుంచే సినిమాకు పాజిటివ్ టాక్ రావడం చూసి భావోద్వేగానికి గురయ్యాను. ఇపుడు ఇటువంటి సినిమా చేశాకా నేనేం చేయాలో అర్థం కాని అయోమయంలో పడిపోయాను. నందిని రెడ్డితో అదే అన్నాను. ఇక నేను రిటైర్మెంట్ తీసుకోవాలా అని అడిగాను అని చెప్పారు. ఇది మరో రెండు రోజులు ఉంటుంది. తర్వాత మంచి స్క్రిప్ట్ కోసం ఆలోచిస్తా. నా మొత్తం చిత్ర బృందానికి ధన్యవాదాలు అంటూ చెప్పింది సమంత.

కార్యక్రమం లో పాల్గొన్న రానా మాట్లాడుతూ 'ఓ బేబి'ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. తనకు కూడా కొరియన్ సినిమా కథలు వినిపించాలని 'ఓ బేబి' చిత్ర బృందాన్ని నవ్వుతూ అడిగారు. కాగా ఈ చిత్రానికి వస్తున్న స్పందన చూసి చైనాలోనూ విడుదల చేయాలని అక్కడి నిర్మాతలు కోరుతున్నట్లు నిర్మాత సునిత తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories