'ఓ బేబీ' ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

ఓ బేబీ ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?
x
Highlights

పెళ్లి తర్వాత చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సమంత. దక్షిణాదిలోని అన్ని భాషల్లో నటిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నో హిట్ చిత్రాలను తన ఖాతాలో...

పెళ్లి తర్వాత చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సమంత. దక్షిణాదిలోని అన్ని భాషల్లో నటిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నో హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా 'ఓ బేబీ'తో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా తొలి వారాంతంలో ప్రపంచ వ్యాప్తంగా రూ.17 కోట్లు రాబట్టినట్లు చిత్ర బృందం పేర్కొంది. ఈ సందర్భంగా సమంత సోషల్‌మీడియాలో ఆనందం వ్యక్తం చేశారు. 'అద్భుతమైన వీకెండ్‌. బేబీపై మీరు చూపిన ప్రేమకు ధన్యవాదాలు. ఆనందంలో వెనక్కి గెంతులేస్తున్నాం' అని ట్వీట్‌ చేశారు. అదేవిధంగా ఈ సినిమా అమెరికాలోనూ సత్తాచాటింది. మూడు రోజుల్లో 5 లక్షల డాలర్లకుపైగా రాబట్టింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories