'ఓ పిట్ట కథ' ట్విట్టర్ రివ్యూ: సూపర్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ..

O pitta katha Movie poster
x
O pitta katha
Highlights

విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజ‌య్ రావు, నిత్యాశెట్టి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం 'ఓ పిట్ట కథ' .. చందు ముద్దు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని భవ్య...

విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజ‌య్ రావు, నిత్యాశెట్టి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం 'ఓ పిట్ట కథ' .. చందు ముద్దు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని భవ్య క్రియేషన్స్ నిర్మించింది. ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఇక సినిమాకి మెగాస్టార్, సూపర్ స్టార్ ఇలా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడంతో సినిమాపైన మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సినిమాని చూసిన ప్రేక్షకుల నుంచి 'ఓ పిట్ట కథ' కి పాజిటివ్ గానే రెస్పాన్స్ వస్తోంది. రొమాంటిక్ థ్రిలర్ కథాంశం బాగా ఆకట్టుకుందంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్లు పెడుతున్నారు. విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజ‌య్ రావు, నిత్యాశెట్టి తమ తమ పాత్రలో ఓడిగిపోయరని సినిమాకి మెయిన్ అట్రాక్షన్ గా నిలిచారని అంటున్నారు. రొటీన్ కి భిన్నంగా సినిమా ఉందని అంటున్నారు.

మొదటిభాగంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీని చాలా అద్భుతంగా నడిపించారని కానీ దానిని చివరివరకు నడిపించడంలో దర్శకుడు అక్కడక్కడ తడబడ్డాడని అంటున్నారు. ఇక సినిమాకి సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచిందని అంటున్నారు. నేపధ్య సంగీతం బాగుందని, ఎమోషన్, లవ్ సన్నివేశాలను దర్శకుడు హత్తుకునేలా తెరకెక్కించాడని అంటున్నారు. మొత్తానికి సినిమాకి ఆడియన్స్ నుంచి అయితే మంచి రెస్పాన్స్ వస్తోంది. మొదటి సినిమాతో నటుడు బ్రహ్మాజీ కొడుకు హిట్ కొట్టినట్టే అన్నమాట..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories