RRR కోసం ఎన్టీఆర్ ,చరణ్ నెలకి పది లక్షలు .. మరి రాజమౌళి మాటేంటి ?

RRR కోసం ఎన్టీఆర్ ,చరణ్ నెలకి పది లక్షలు .. మరి రాజమౌళి మాటేంటి ?
x
Highlights

బాహుబలి లాంటి భారీ హిట్టు తరవాత రాజమౌళి ఏకంగా టాలీవుడ్ నుండి ఇద్దరు బడా హీరోలను పెట్టి మల్టీ స్టారర్ సినిమా తీసేందుకు సిద్దం అయ్యాడు. సినిమాని భారీ...

బాహుబలి లాంటి భారీ హిట్టు తరవాత రాజమౌళి ఏకంగా టాలీవుడ్ నుండి ఇద్దరు బడా హీరోలను పెట్టి మల్టీ స్టారర్ సినిమా తీసేందుకు సిద్దం అయ్యాడు. సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం RRR అనే టైటిల్ తో సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.. అయితే ఈ సినిమాకి చరణ్, తారక్ ఎంత రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారు అన్న చర్చ ఫాన్స్ లో కలుగుతుంది.

బేసిక్ గానే రాజమౌళి సినిమా అంటే చాలా టైం పడుతుంది. అయన సినిమాకి ఒక్కసారి డేట్స్ ఇచ్చమంటే మరో సినిమా చేయడానికి వీలులేదు... మళ్ళీ ఇది భారీ బడ్జెట్ తో కుడుకున్నా సినిమా కావడంతో ఇద్దరు హీరోలు భారీ రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎన్టీఆర్-రామ్ చరణ్ లకు చెరో పాతిక కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. అంతేకాకుండా సినిమా కోసం ఇద్దరు హీరోలు చాలా టైమ్ కేటాయిస్తున్నారు కాబట్టి నెలకు చెరో పది లక్షల వంతున షూటింగ్ ఖర్చులకోసం కేటాయించినట్లు తెలుస్తోంది.

ఇలా షూటింగ్ ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజులుకు గాను ఇద్దరు హీరోలకు చెరో పదిలక్షలు వంతున ఇస్తూ వెళ్లడానికి ముందుగానే అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. అంటే రెండేళ్ల పాటు ఇలాగే షూటింగ్ జరిగితే ఇద్దరు హీరోలకు చెరో 2.40 కోట్ల రూపాయలు అదనంగా వస్తాయన్నమాట. ఇక రాజమౌళి విషయానికి వస్తే ఆయనకి రెమ్యూనిరేషన్ లేదు. సినిమాకి వచ్చే లాభాల్లోనే ఆయనకి వాటా ఉంటుందని ఇప్పటికే చిత్ర నిర్మాతతో అయన ఒప్పందం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories