కరోనా నివారణకు రంగంలోకి దిగిన టాప్‌హీరోలు

కరోనా నివారణకు రంగంలోకి దిగిన టాప్‌హీరోలు
x
NTR, Ram charan
Highlights

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తుంది. చైనాలో మొదలైన ఈ వ్యాధి ఇప్పుడు దాదాపుగా 140 పైగా దేశాలకి సోకి 6500 మంది పైగా ప్రాణాలను బలితీసుకుంది.

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తుంది. చైనాలో మొదలైన ఈ వ్యాధి ఇప్పుడు దాదాపుగా 140 పైగా దేశాలకి సోకి 6500 మంది పైగా ప్రాణాలను బలితీసుకుంది. ఇక భారత్ లో కూడా వందకి పైగానే కేసులు నమోదు అయ్యాయి. మరికొంత మందికి చికిత్స జరుగుతుంది. ఇక తెలంగాణాలో కూడా నాలుగు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. దీనితో అప్రమత్తం అయిన ప్రభుత్వం థియేటర్స్, కాలేజీలు, స్కూల్లు, మాల్స్, క్లబ్స్, పబ్స్ వంటి వాటిని మార్చి 31 వరకు మూసి వేయాలని ఆదేశించింది.

ఇక కరోనా నివారణ కోసం, ప్రజల్లో అవగాహన కోసం టాలీవుడ్‌ టాప్‌ హీరోలు అయిన రామ్ చరణ్, ఎన్టీఆర్ రంగంలోకి దిగారు. వైరస్‌ వల్ల భయాందోళన అవసరం లేదని, కానీ చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలని 6 సూత్రాలతో కూడిన ఓ వీడియో ద్వారా సందేశాన్ని ఇచ్చారు. ఈ వీడియోను ఆర్.ఆర్. ఆర్ చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

జనసమూహాలకు దూరంగా ఉందాం. చికిత్స కాదు. నివారణ జాగ్రత్తలు ముఖ్యమన్నారు. ఎక్కువగా నీరు తాగాలని, అవసరమైతేనే బయటకు వెళ్లాలని, అనుమానం వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలన్నారు ఇద్దరు హీరోలు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు మోచేతిని అడ్డుపెట్టుకోవాలని, షేక్ హ్యాండ్స్ ఇవ్వొద్దని, చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ప్రస్తుతం వీరిద్దరూ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్.ఆర్. ఆర్ చిత్రంలో కలిసి నటిస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories