ఎన్టీఆర్ కొత్త లుక్ : ఎన్టీఆర్ పూర్తిగా మారిపోయాడుగా....

ఎన్టీఆర్ కొత్త లుక్ : ఎన్టీఆర్ పూర్తిగా మారిపోయాడుగా....
x
Highlights

ఎన్టీఆర్ కొత్త లుక్ ఇప్పుడు సెన్సేషన్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ లుక్ లో ఎన్టీఆర్ చాలా సన్నబడి కనిపిస్తున్నారు. తాజాగా...

ఎన్టీఆర్ కొత్త లుక్ ఇప్పుడు సెన్సేషన్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ లుక్ లో ఎన్టీఆర్ చాలా సన్నబడి కనిపిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ వస్త్రాలకి సంబంధించిన ప్రకటనలో కనిపించాడు. ఈ ప్రకటన ఆయన అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆ ప్రకటనలో ఎన్టీఆర్ లుక్స్, చెప్పే డైలాగ్స్ వావ్ అనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు.














ఇందులో ఎన్టీఆర్ కొమరం భీం గా కనిపించనున్నారు. అయితే అయన లుక్ ని ఇంతవరకు బయటకు రాలేదు. అలా అని రామ్ చరణ్ లుక్ కూడా బయటకు రాలేదు. కానీ చరణ్ సైరా సినిమా ప్రమోషన్ లో కనిపిస్తూన్నాడు. అక్టోబర్ 22న కొమరం భీం పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తుందని టాక్ నడుస్తుంది. కానీ దీనిపైన చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు.

నిజానికి ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న ప్రతిసారి రాజమౌళి అయన లుక్ ని మార్చుకుంటూ వస్తున్నారు. యమదొంగ సినిమా అప్పుడు ఎన్టీఆర్ ని లావు తగ్గమని చెప్పారు జక్కన్న. ఇప్పటికి అదే లలుక్ ని మైంటైన్ చేస్తున్నారు ఎన్టీఆర్. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ కోసం మళ్లీ ఎన్టీఆర్ లుక్ పై ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. 1920 నాటి పరిస్థితుల నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో RRR మూవీ రూపొందుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories