'ఎన్టీఆర్ బయోపిక్'లో వైఎస్సార్ పాత్ర.. ఎవరు చేశారో తెలుసా..?

ఎన్టీఆర్ బయోపిక్లో వైఎస్సార్ పాత్ర.. ఎవరు చేశారో తెలుసా..?
x
Highlights

ప్రఖ్యాత నటుడు, ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఆయన బయోపిక్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులోని...

ప్రఖ్యాత నటుడు, ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఆయన బయోపిక్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులోని మొదటిపార్టు కథానాయకుడు బుధవారం విడుదల అయింది. ఇందులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో శ్రీతేజ్ కనిపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వైయస్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు.

అయితే ఈ సినిమాలో ఆసక్తికరంగా వైయస్ ఎంట్రీ ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో.. ఈ ప్రమాణస్వీకారానికి ఎన్టీఆర్ విచ్చేస్తారు. ఆ సమయంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని తన మిత్రుడిగా ఎన్టీఆర్‌కు చంద్రబాబు నాయుడు పరిచయం చేస్తున్న సన్నివేశాన్ని ఇందులో చూపించారు. కాగా అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి , చంద్రబాబు నాయుడు మంచి స్నేహితులుగా ఉండేవారు.

Show Full Article
Print Article
Next Story
More Stories