అనుకున్న టైంకే ధియేటర్ లోకి RRR .. చిత్ర నిర్మాత క్లారిటీ!

అనుకున్న టైంకే ధియేటర్ లోకి RRR .. చిత్ర నిర్మాత క్లారిటీ!
x
RRR
Highlights

కరోనా వైరస్ ప్రభావం చిత్ర పరిశ్రమపైన బాగానే పడింది. ధియేటర్లు మూతపడ్డాయి. షూటింగ్లు వాయిదా పడ్డాయి.

కరోనా వైరస్ ప్రభావం చిత్ర పరిశ్రమపైన బాగానే పడింది. ధియేటర్లు మూతపడ్డాయి. షూటింగ్లు వాయిదా పడ్డాయి. రిలీజ్ కి సిద్దమైన సినిమాలు పోస్ట్ పోన్ చేసుకున్నాయి. ఇలా చిత్రపరిశ్రమకి భారీ నష్టమే వచ్చిందని చెప్పాలి. ఇక ఇది ఇలా ఉంటే టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్.. (రౌద్రం, రణం, రుధిరం).. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఉగాది సందర్భంగా సినిమాకి సంబంధించిన లోగోను మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. అంతేకాకుండా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ లుక్ ని విడుదల చేసింది. ఈ ఫ‌స్ట్ లుక్ వీడియో ప‌లు భాష‌ల‌లో విడుద‌లై ప్రేక్షకుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది. కానీ కరోనా వైరస్ ప్రభావంతో సినిమా వాయిదా పడింది. సినిమా షూటింగ్ మరోసారి వాయిదా పడడంతో సినిమా విడుదల తేది కూడా మరోసారి వెనక్కి వెళ్లనుంది అని ప్రచారం సాగుతుంది. ముందుగా ఈ సినిమాని ఈ ఏడాది జూలై 30న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటిచింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల వలన సినిమాని వచ్చే ఏడాది 2021 జనవరి 8 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే మరోసారి వాయిదా పడుతుందని వార్తలు రావడంతో చిత్ర నిర్మాత డివివి దానయ్య దీనిపైన స్పందించారు.

అనుకున్న సమయానికే సినిమా :

ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రకటించిన సమయానికే (జనవరి 08) సినిమాని విడుదల చేస్తామని నిర్మాత డీవీవీ దానయ్య వెల్లడించారు. పక్కా ప్లాన్ ప్రకారమే షూటింగ్ కి ప్లాన్ చేశామని, చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తైందని పూణె షెడ్యూల్‌లో బాలీవుడ్ హీరోయిన్ ఆలియ భట్ జాయిన్ అవుతుందని వెల్లడించారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ వర్క్, విఎఫ్‌ఎక్స్ వర్క్ స్పీడ్ గా జరుగుతున్నాయని వెల్లడించారు. లాక్ డౌన్ నేపథ్యంలో అదనపు ఖర్చులు ఎక్కువ అయ్యాయని సినిమాకి 450 బడ్జెట్ తో సినిమాని నిర్మిస్తున్నామని అన్నారు. డిజిటల్ రైట్స్ రూ. 250 కోట్లు పలుకుతుండటంతో ధీమాగా ఉందట చిత్ర యూనిట్.

ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌ లతో పాటు హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్, సముద్రఖని,శ్రియ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడం, ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథని అందించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories