ఒక ఆడపిల్ల గడపదాటి వచ్చి ఎందుకు కష్టపడి పనిచేస్తోందనే సానుభూతి కూడా ఉండదు!

ఒక ఆడపిల్ల గడపదాటి వచ్చి ఎందుకు కష్టపడి పనిచేస్తోందనే సానుభూతి కూడా ఉండదు!
x
Highlights

గీతాసింగ్ హాస్యనటిగా అందరికీ సుపరిచితురాలు. తెలుగు తెరపై తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. కానీ, ఇండస్ట్రీలో కష్టాలు అన్నీ ఇన్నీ కాదని...

గీతాసింగ్ హాస్యనటిగా అందరికీ సుపరిచితురాలు. తెలుగు తెరపై తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. కానీ, ఇండస్ట్రీలో కష్టాలు అన్నీ ఇన్నీ కాదని చెబుతోంది. ఇక్కడ వేషాలు దొరకడం ఒక ఎత్తైతే, పని చేసిన తరువాత దానికి సంబంధించిన పారితోషికం అందుకోవడం మరో ఎత్తు అని చెబుతోంది. ఆ బాధ ఎవరికీ చెప్పలేం. అలా అని ఊరుకోలేం అంటోంది ఆమె.

''సినిమాలకి .. ఆయా ఈవెంట్లకి సంబంధించిన డబ్బులు చాలా వరకూ రావలసినవి వున్నాయి. చాలా కాలంగా ప్రయత్నిస్తున్నా అవి రావడం లేదు. గట్టిగా డబ్బులు అడగలేకపోతున్నాననే ఉద్దేశంతో వేషాలకి పిలిచేవాళ్లు లేకపోలేదు. ఒక ఆడపిల్ల గడపదాటి వచ్చి ఎందుకు కష్టపడి పనిచేస్తోందనే సానుభూతి కూడా చాలామందిలో కనిపించడం లేదు. ఒకే ఫీల్డులో ఉంటూ గట్టిగా అడగలేము .. మరెవరికీ ఫిర్యాదు చేయలేము" అంటూ గీతాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories