నాగ్ ఆ దర్శకుడికి పారితోషికం ఇవ్వటం లేదట!

నాగ్ ఆ దర్శకుడికి పారితోషికం ఇవ్వటం లేదట!
x
Highlights

సోగ్గాడే చిన్ని నాయన కింగ్ నాగ్ కి మంచి లాభాలను తెచ్చిపెట్టిన సినిమా. ఆ సినిమాలో నాగార్జున రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించాడు. అమాయకుడైన డాక్టర్...

సోగ్గాడే చిన్ని నాయన కింగ్ నాగ్ కి మంచి లాభాలను తెచ్చిపెట్టిన సినిమా. ఆ సినిమాలో నాగార్జున రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించాడు. అమాయకుడైన డాక్టర్ గా.. కిలాడీ బంగార్రాజు గా ఈ రెండిటిలోనూ తన నటనతో మెప్పించాడు. అయితే, బంగార్రాజు పాత్ర మాత్రం ప్రేక్షకుల్లో మంచి ఇమేజి సంపాదించుకుంది. దీంతో ఆ ఇమేజిని మరింతగా పెంచుకునే ఆలోచన చేశాడు నాగార్జున. బంగార్రాజు పేరుతో .. సోగ్గాడే..దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమాకి రెడీ యైపోయాడు. ఈ సినిమాలో చైతూ కూడా సందడి చేయబోతున్నాడని తెలుస్తోంది.

ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక వార్త ఇండస్ట్రీ లో హల్చల్ చేస్తోంది. ఈ సినిమా దర్శకుడు కళ్యాణ్ కృష్ణకి రెమ్యునరేషన్ ఇవ్వడం లేదన్నదే ఆ వార్త. అయితే, రెమ్యునరేషన్ బదులుగా సినిమా హిట్ అయితే లాభాల్లో వాటా ఇస్తానని నాగార్జున చెప్పారని అనుకుంటున్నారు. దీనికి ఆ దర్శకుడు కూడా ఒప్పుకున్నాదనేది టాక్. అంటే ఓ కొత్త పద్ధతికి నాగ్ శ్రీకారం చుట్టినట్టే!

Show Full Article
Print Article
More On
Next Story
More Stories