బండ్ల ఎక్కడ ? అసలు మహేష్ సినిమాలో ఉన్నాడా ?

బండ్ల ఎక్కడ ? అసలు మహేష్ సినిమాలో ఉన్నాడా ?
x
Highlights

నటుడుగా మొఖానికి మేకప్ వేసుకొని చాలా రోజులు అయింది బండ్ల గణేష్ .. నటుడుగా సినిమాలు మానేసి నిర్మాతగా భాద్యతలు తీసుకున్నారు . అ తర్వాత రాజకీయాల్లోకి...

నటుడుగా మొఖానికి మేకప్ వేసుకొని చాలా రోజులు అయింది బండ్ల గణేష్ .. నటుడుగా సినిమాలు మానేసి నిర్మాతగా భాద్యతలు తీసుకున్నారు . అ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి బిజీ బిజీ అయిపోయారు . అయన చివరగా నటించిన సినిమా బిజినెస్ మన్ .. అ తర్వాత బండ్ల నటించింది లేదు . మహేష్ బాబు తాజా సినిమా సరిలేరు నికేవ్వరులో ఓ ముఖ్య పాత్రలో బండ్ల గణేష్ కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి . దీనిపైన బండ్ల గణేష్ కుడా స్పందించాడు .

మంచి కామెడిని పండించగల దర్శకుడిగా పేరున్న అనిల్ , బండ్ల కోసం ఓ పాత్రను క్రియేట్ చేసారట .. సినిమాలో భాగంగా వచ్చే ఓ ట్రైన్ ఎపిసోడ్ లో బండ్ల కనిపించనున్నారు . దీనిపైన షూట్ ఈ నెల 26 నుండి అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్ లో జరగాల్సి ఉంది. కానీ దీనిపైన చిత్ర నిర్మాతలు బండ్లని మీట్ అయింది లేదు .

అయితే బండ్ల గణేష్ మాత్రం విదేశాలకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్తునట్లు తెలుస్తుంది . మరి ఇందులో బండ్ల గణేష్ నటిస్తారా లేదా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది . ఇందులో మహేష్ సరసన రష్మిక మందన్నా నటిస్తుంది . దిల్ రాజు నిర్మాత . ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories