అల వైకుంఠ‌పురుములో నుంచి నివేదా లుక్ రిలీజ్

అల వైకుంఠ‌పురుములో నుంచి నివేదా లుక్ రిలీజ్
x
nivetha pethuraj
Highlights

నివేదా పెతురాజ్ మెంటల్ మదిలో అనే సినిమాతో చిత్ర పరిశ్రమకి పరిచయం అయింది . ఆ తర్వాత చిత్రలహరి, బ్రోచేవారెవరురా

జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ నుంచి వస్తున్న మూడో చిత్రం అల వైకుంఠ‌పురుములో.. పూజా హేగ్దే కథానాయకగా నటిస్తుంది. హారికా హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. సంక్రాంతి పండుగకి కానుకగా సినిమాని జనవరి 12 న విడుదల చేయనున్నారు.

ఇప్పటికే విడుదల చేసిన సామ‌జ‌వ‌ర‌గ‌మ‌నా.., రాములో రాములో.. , ఓ మై గాడ్ డాడీ సాంగ్స్ శ్రోతలను వీపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దీనికి తోడు సినిమాలోని అల్లు అర్జున్ , టబు, సుశాంత్ లుక్స్ సినిమాపైన భారీ అంచనాలను క్రియేట్ చేసాయి.. త్వరలోనే చిత్ర టిజర్ ని కూడా విడుదల చేయనున్నారు. అయితే సినిమాలో మరో ముఖ్యపాత్ర పోషిస్తున్న నివేదా పెతురాజ్ లుక్ ని బయటకు వదిలింది చిత్ర బృందం.. ఈరోజు నివేదా పెతురాజ్ పుట్టిన రోజు కావడంతో ఆమెకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ నివేదా లుక్ ని విడుదల చేశారు.

నివేదా పెతురాజ్ మెంటల్ మదిలో అనే సినిమాతో చిత్ర పరిశ్రమకి పరిచయం అయింది . ఆ తర్వాత చిత్రలహరి, బ్రోచేవారెవరురా లాంటి చిత్రాలలో నటించింది. చిత్రలహరి సినిమా ఆమెకి నటిగా మంచి గుర్తింపుని తెచ్చింది. ఇప్పుడు ఆమె అల వైకుంఠ‌పురుమ‌లో సినిమాతో పాటు రామ్ హీరోగా చేస్తున్న రెడ్ సినిమాలో కూడా నటిస్తుంది. అంతేకాకుండా మరో మూడు తమిళ సినిమాల్లో నటిస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories