రష్మిక వన్స్ మోర్ .. నువ్వే నా ఫేవరేట్

రష్మిక వన్స్ మోర్ .. నువ్వే నా ఫేవరేట్
x
Highlights

యంగ్ హీరో నితిన్ కన్నడ బ్యూటి రష్మిక మందన్నా కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'భీష్మ'.. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్ సినిమాకి మంచి హైప్ ని...

యంగ్ హీరో నితిన్ కన్నడ బ్యూటి రష్మిక మందన్నా కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'భీష్మ'.. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్ సినిమాకి మంచి హైప్ ని తీసుకువచ్చాయి. ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఫై నాగ వంశీ నిర్మిస్తుండగా మణిశర్మ కుమారుడు మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు.సంపత్, బ్రహ్మాజీ, వెన్నల కిషోర్, రఘుబాబు, నరేష్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రొమాటింక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఫిబ్రవరి 21 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

తాజాగా ఈ చిత్రానికి గుమ్మడికాయ కొట్టేశారు. అనంతరం హీరో నితిన్ చిత్ర యూనిట్ పైన ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. "భీష్మ లాంటి సినిమాని నాకు ఇచ్చినందుకు వెంకీ కుడుమలకి థాంక్స్ అండ్ ఐ లవ్ యూ.. నీ గురించి మాటల్లో చెప్పలేను. రష్మిక నువ్వు నా ఫేవరేట్. నీతో మళ్లీ సినిమా చేసేందుకు ఎక్కువ వెయిట్‌ చేయలేను" అంటూ ట్వీట్ చేశాడు నితిన్. ఇక దీనిపైన రష్మిక ట్వీట్ చేస్తూ.. "మీతో ఈ చిత్రం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మీరు నా బెస్ట్ ఫ్రెండ్ " అంటూ రిప్లయ్ ఇచ్చింది.

ప్రస్తుతం రష్మిక బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ భామ ప్రస్తుతం సుకుమార్ , అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా తమిళ్ , కన్నడ చిత్రాలలో నటిస్తోంది.

ఇక ఈ సినిమా తర్వాత నితిన్ విభిన్నమైన కథలను తెరకెక్కించే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమాని, తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే చిత్రంలో నటిస్తున్నాడు. రంగ్ దే చిత్రంలో నితిన్ కి జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమాని చేసేందుకు పిక్స్ అయ్యాడు నితిన్.. ఈ సినిమాలు ఈ సంవత్సరంలో విడుదల చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories